Article 370 : ఆర్టికల్ 370 రద్దు సరైనదే – సీజేఐ
ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది
- By Sudheer Published Date - 11:43 AM, Mon - 11 December 23

ఆర్టికల్ 370 (Article 370) రద్దుపై సుప్రీంకోర్టు (SC Verdict ) కీలక తీర్పు వెలువరించింది. బీజేపీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో 370 ఆర్టికల్ రద్దు నిర్ణయం ఒకటి. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిపై పార్లమెంట్‌లో అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా.. ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు (సోమవారం) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
జమ్మూ కశ్మీర్ (Jammu kashmir) కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టి పారేయలేమని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ‘ఆర్టికల్ 370.. జమ్ము కశ్మీర్ లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. దేశంలో విలీనం అయినప్పుడు జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదు. విలీనం తర్వాత కూడా జమ్మూ కశ్మీర్ కు అంతర్గత సార్వభౌమాధికారం ఇవ్వలేదు. ఆర్టికల్ 370 తాత్కాలిక వెసులుబాటు మాత్రమే. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదు. 370 ఆర్టికల్ రద్దు అంశంపై ఇప్పటికే 3 తీర్పులు ఉన్నాయి. గత తీర్పులను పిటిషనర్లు సవాల్ చేయలేదు. జమ్మూకాశ్మీర్ అంశంపై రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేం’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో దేశ ప్రజలకు, ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రజలకు బీజేపీ కీలక సూచన చేసింది. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని కోరింది.
Read Also : IPL 2024: ఐపీఎల్ పై పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్