SBI : పేద విద్యార్థులకు SBI గుడ్ న్యూస్
SBI : ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌లో అగ్రగామిగా నిలిచిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన సామాజిక బాధ్యతల కార్యక్రమాల్లో భాగంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది
- By Sudheer Published Date - 08:00 PM, Tue - 30 September 25

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌లో అగ్రగామిగా నిలిచిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన సామాజిక బాధ్యతల కార్యక్రమాల్లో భాగంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. 2015లో స్థాపించబడిన ఎస్బీఐ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ 2022 నుంచి “ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్” పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఈ సంవత్సరం కూడా 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న పేదింటి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. మొత్తం 23,230 మంది విద్యార్థులకు రూ.90 కోట్లు కేటాయించి ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించనుందని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి ఇటీవలే వెల్లడించారు.
Asia Cup: ఆసియా కప్ గెలిచిన భారత్.. కానీ ట్రోఫీ ఎక్కడా?
ఈ స్కాలర్‌షిప్ కోసం ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024-25 విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7 సీజీపీఏ సాధించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ ప్రమాణం 67.5% లేదా 6.3 సీజీపీఏగా నిర్ణయించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మించకూడదన్న నిబంధన కూడా ఉంది. ఎంపికైన విద్యార్థులకు వార్షికంగా ₹15,000 నుంచి ₹20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే ప్రతి ఏడాది ఈ స్కాలర్‌షిప్‌ను రీన్యూ చేసుకోవాలంటే విద్యార్థులు తమ కోర్సులో కనీస హాజరు, ఉత్తీర్ణత వంటి ప్రమాణాలను పాటించాలి.
అర్హత కలిగిన విద్యార్థులు 2025 నవంబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్బీఐ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్ (https://www.sbiashascholarship.co.in/ )(https://www.sbiashascholarship.co.in))లోకి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. దేశవ్యాప్తంగా పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల సొంత కలలను సాకారం చేసేందుకు ఎస్బీఐ ఈ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌ను మరో అడుగు ముందుకు వేస్తోంది. ఈ ఆర్థిక సాయం విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా, తమ ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.