Bharat Jodo Yatra And Savarkar: భారత్ జోడో యాత్రలో రాజకీయ దుమారం: కాంగ్రెస్ ఫ్లెక్సీపై సావర్కర్ ఫోటో
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేయించిన పోస్టర్లలో సావర్కర్ ఫోటో కనిపించడం కేరళలో రాజకీయ దుమారం రేపింది.
- By Hashtag U Published Date - 09:03 PM, Wed - 21 September 22

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేయించిన పోస్టర్లలో సావర్కర్ ఫోటో కనిపించడం కేరళలో రాజకీయ దుమారం రేపింది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కేరళ లోని కొచ్చి జిల్లా అలువా పట్టణంలో పర్యటించనున్నారు. ఈక్రమంలో
రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు అలువా పట్టణ కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర్య సమర యోధుల ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేయించారు. తయారు చేయించిన తర్వాత వాటిని కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి కూడా చూసుకోకుండానే అలువా పట్టణ ప్రధాన రోడ్లపై ఏర్పాటు చేయించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఫ్లెక్సీలపై సావర్కర్ ఫోటో ఉన్న వీడియోను ఓ వ్యక్తి తీశాడు. దీన్ని
కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాజకీయ విమర్శల పర్వం మొదలైంది.పోస్టర్ ప్రింటింగ్ లో పొరపాటు కారణంగా ఈ తప్పు జరిగిందని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. ఫ్లెక్సీని ప్రింట్ చేసిన వ్యక్తి ఇంటర్నెట్ నుంచి తప్పుడు ఫోటోను డౌన్ లోడ్ చేసుకొని ప్రింటింగ్ కు వాడటం వల్ల ఇలా జరిగిందని తేల్చి చెప్పింది.
వెంటనే సావర్కర్ ఫోటోలపై మహాత్మా గాంధీ ఫోటోలను అతికించామని పేర్కొంది.ఈ అంశంపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. `ఇప్పటికైనా కాంగ్రెస్ వాస్తవాన్ని గుర్తించింది. సంతోషం. రాహుల్ గాంధీ ఆలస్యంగానైనా నిజమైన యోధుడెవరో గుర్తించారు` అంటూ వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కాంగ్రెస్ ఏనాడు కూడా సావర్కర్ ను స్వాతంత్య్ర సమర యోధుడిగా గుర్తించలేదు. బ్రిటిష్ వాళ్ళ తో పోరాడేందుకు బదులుగా ఆయన క్షమాపణ చెప్పారని ఆరోపిస్తుంది. మరోవైపు బీజేపీ సావర్కర్ ను స్వాతంత్య్ర సమర యోధుడిగా గుర్తిస్తుంది. ఇక కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం కేరళలోని ఎర్నాకులం జిల్లాలో యాత్ర సాగుతోంది. దేశం నలుమూలల నుంచి వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలతో మంచి జోష్ లో యాత్ర సాగుతోంది.
Related News

Bharat Jodo Yatra: శ్రీనగర్ లో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం
భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శ్రీనగర్‌లో శాంతియుతంగా మార్చ్‌ను నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ మార్చ్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తారిక్ హమీద్ కర్రా నాయకత్వం వహించారు