Sanjay Nirupam : మన్మోహన్ సింగ్ పై సంజయ్ నిరుపమ్ సంచలన కామెంట్స్
Sanjay Nirupam : మన్మోహన్ సింగ్ గొప్ప నేత అనడంలో సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటికీ చెరిగిపోలేదు
- Author : Sudheer
Date : 27-12-2024 - 4:24 IST
Published By : Hashtagu Telugu Desk
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh Death) ఇక లేరు అనే వార్త యావత్ ప్రజానీకం తట్టుకోలేకపోతున్నారు. 92 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ సమర్థవంతమైన రాజకీయ ప్రయాణంతో పాటు దేశంలోని అనేక ఆర్థిక సంస్కరణలకోసం ఎంతో కృషి చేశారు.
మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపాన్ని అందించారు. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు దేశాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. రెండు సార్లు భారత ప్రధానిగా ఎన్నికై ఆయన చేసిన సేవల గురించి అంత మాట్లాడుకుంటూ ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల ప్రముఖులే కాదు ఇతర రంగాల వారు సైతం మన్మోహన్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మన్మోహన్ సింగ్పై శివసేన (షిండే) నేత, మాజీ MP సంజయ్ నిరుపమ్ (Sanjay Nirupam ) సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
‘మన్మోహన్ సింగ్ గొప్ప నేత అనడంలో సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటికీ చెరిగిపోలేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.’మీరు కూడా ఆ సమయంలో అదే ప్రభుత్వంలో ఉన్నారు కదా?’ అంటూ నిరుపమ్‌ను నెటిజన్లు ప్రశ్నించారు. సంజయ్ నిరుపమ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతగా పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌ను విడిచిపెట్టి శివసేనలో చేరారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరంగా విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే మన్మోహన్ సింగ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Manmohan Singh : విమానంలో మన్మోహన్ ప్రెస్ మీట్..ఇది కదా స్టైల్ అంటే..!!