Russia-Ukraine War:భారత్ పై తీవ్ర ప్రభావం…పెరగనున్న ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ధరలు..!!!
రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధానిని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి.
- By Hashtag U Published Date - 02:32 PM, Sat - 26 February 22
రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధానిని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను తన ఆధీనంలో తీసుకుంది రష్యా. ఇప్పటికే కొన్ని ఉక్రెయిన్ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగరవేశారు. ఇదే విషయాన్ని అధికారికంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఇంకో 96 గంటల్లో రష్యా చేతికి కీవ్ నగరం పూర్తిస్థాయిలో రానున్నట్లు తెలిపారు. అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఆ ప్రభావం భారత్ పై తీవ్రంగా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొన్నింటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ఇక రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది. వేటి ధరలు పెరుగుతాయన్న విషయానికి వస్తే…పోయినఏడాది భారత్ 18.9 మిలియన్ టన్నులు సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం జరిగింది. దీనిలో మెజార్టీ భాగం ఈ రెండు దేశాలవి. 70శాతం ఉక్రెయిన్ కాగా, 20శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మరో 10 శాతం అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకుంది భారత్. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ సరఫరాలు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు మూడు వారాలు ఇలా కొనసాగితే మన ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు.
ఆహార పదార్థాలపైన్నే కాదు స్మార్ట్ ఫోన్లపై కూడా ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. పరిశోధన సంస్థ టెక్ సెట్ ప్రకారం, చిప్ లను తయారు చేసేందుకు ఉపయోగించే లేజర్స్ ను తయారు చేయడానికి వినియోగించే నియాన్ గ్యాస్ ప్రొడక్టులో ఉక్రెయిన్ అగ్రగామిగా ఉంటోంది. ఇప్పుడు ఆ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని చెప్పవచ్చు. పల్లాడియం అనేది సెమీకండక్టర్లను తయారు చేయడానికి ఉపయోగించే లోహం చాలా అరుదైంది. దాదాపు 35శాతం పల్లాడియం రష్యా నుంచే దిగుమతి అవుతుంది. పల్లాడియం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం కావడంతో ఇది చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రెండు దేశాల మధ్య నెలకొన్ని ఈ ఉద్రికత్త పరిస్థితులు ల్యాప్ టాప్ లతోపాటు స్మార్ట్ ఫోన్లపై అధిక ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Related News
Missile Strikes Near Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రాణపాయం
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Missile Strikes Near Zelensky)పై రష్యా క్షిపణి దాడి చేసింది.