IT Raids : పొగాకు కంపెనీపై ఆదాయ పన్ను అధికారుల దాడులు.. 4.5 కోట్ల నగదు స్వాధీనం
- By Latha Suma Published Date - 02:22 PM, Fri - 1 March 24

IT Raids : పన్ను ఎగవేతలకు పాల్పడిన కాన్పూర్(Kanpur)కు చెందిన పొగాకు కంపెనీపై ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. కంపెనీ యజమాని ఇంటిపై జరిపిన దాడుల్లో రూ. 4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు(IT officers) స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ(delhi)లోని కంపెనీ అధినేత నివాసంలో చేపట్టిన దాడుల్లో రోల్స్ రాయిస్ పాంథమ్, మెక్‌లారెన్, లంబోర్గిని, ఫెరారీ వంటి రూ. 60 కోట్లకు పైగా విలువైన కార్లను అధికారులు గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాన్పూర్‌లోని బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో గురువారం రాత్రి నుంచి ఐటీ అధికారుల బృందం సోదాలు చేపడుతోంది. ఇక 15 నుంచి 20 ఐటీ బృందాలు కంపెనీకి చెందిన పలువురిపై గుజరాత్, ఏపీ, ఢిల్లీ సహా ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.
read also :AP : బీటెక్ స్టూడెంట్ మాటలకు పులకరించిపోయిన సీఎం జగన్
ఇతర సంస్ధలకు ముడిపదార్ధాలను సరఫరా చేసే పొగాకు కంపెనీ పెద్దమొత్తంలో పన్నులు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. కంపెనీ టర్నోవర్ 100 నుంచి 150 కోట్లు కాగా, రికార్డుల్లో కేవలం 20 నుంచి రూ. 25 కోట్లు చూపుతున్నారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి.