Renuka Defamation : మోడీ`శూర్ఫణక`కామెంట్స్ పై రేణుక పరువునష్టం దావా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద పరువునష్టం దావా (Renuka Defamation)
- Author : CS Rao
Date : 24-03-2023 - 4:29 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద పరువునష్టం దావా (Renuka Defamation) వేయడానికి మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి సిద్దమయ్యారు. రామాయణంలో శూర్ఫణకగా ఆమెను పోల్చుతూ పార్లమెంట్ లో మోడీ (Modi)చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానంటూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం అయిన దేశంలోనే అత్యున్నత చట్ట సభ పార్లమెంట్. ఆ సభలో శూర్పణఖ అంటూ మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రేణుకా చౌదరిని అప్పట్లో మోడీ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ మీద ఆనాడు సభలో గందరగోళం రేగింది. ఇప్పుడు పరువు నష్టం కేసును చూపిస్తూ రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ మోడీ మీద రేణుక కేసు వేయడానికి సిద్దమవుతున్నారు. ఆ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద పరువునష్టం దావా (Renuka Defamation)
ఆనాడు పార్లమెంట్ వేదికగా మోడీ చేసిన చేసిన వ్యాఖ్యలు స్త్రీ జాతికి అవమానం కాదా? ఇది పార్లమెంటును అవమానించడం కాదా? అంటూ రేణుకా చౌదరి ప్రశ్నించారు. “@రేణుకాకాంగ్రెస్అవును, పరువు నష్టం కేసు పెట్టబోతున్నాను.(Renuka Defamation) “నేను నా స్నేహితుడిని మరింత ధనవంతుడిని చేయడానికి నిబంధనలను ఉల్లంఘిస్తాను, కానీ మీరు నన్ను ప్రశ్నిస్తే, నేను మిమ్మల్ని లోక్‌సభ నుండి అనర్హులుగా చేస్తాను.“ అంటూ రేణుక ట్వీట్ చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆమెను ఆనాడు మోడీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తోంది.
రేణుకా చౌదరి ట్విట్టర్ వేదికగా మోడీని టార్గెట్ చేస్తూ
సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా వెల్లడిస్తూ తీర్పు చెప్పింది. మోడీ (Modi)అనే పదాన్ని ఒక వర్గానికి ఆపాదిస్తూ రాహుల్ పదేపదే కించపరిచేలా మాట్లాడుతున్నారని కోర్టు విశ్వసించింది. అందుకే, ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. వెంటనే కోర్టులో బెయిల్ పటిషన్ ను రాహుల్ వేశారు. బెయిల్ కూడా మంజూరు అయింది. అయితే, తీర్పు వచ్చిన మరుసటి రోజు(24 గంటలకు తిరగకుండా) లోక్ సభ సెక్రటరియేట్ రాహుల్ లోక్ సభకు అనర్హుడిగా వేటు వేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేస్తూనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగింది. ఆ క్రమంలో రేణుకా చౌదరి ట్విట్టర్ వేదికగా మోడీని టార్గెట్ చేస్తూ వార్ ప్రారంభించారు.
Also Read : Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!
మోడీ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ఆమె తెలంగాణ కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్దమవుతున్నారు. ఆ పిటిషన్ ను కోర్టు స్వీకరిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరం. ఎందుకంటే, గత పార్లమెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి. ఆనాడు పార్లమెంట్ వేదికగా ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నప్పటికీ ఆ తరువాత మోడీ ఇచ్చిన సమాధానంతో వివాదం సద్దుమణిగింది. ఇలాంటి గ్రౌండ్స్ ఉన్నప్పుడు రేణుకాచౌదరి వేసే పరువు నష్టం దావాను కోర్టు స్వీకరిస్తుందా? అనేది వేచిచూడాల్సిన అంశం.
Also Read : Rahul Gandhi Disqualified: రాహుల్ పై అనర్హత వేటు