Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!
అనర్హతపై (Rahul Disqualified)జూలై 10, 2013 నాడు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేసేలా
- By CS Rao Published Date - 04:00 PM, Fri - 24 March 23

దేవుడి స్ర్రిప్ట్ రాహుల్ గాంధీ అనర్హత(Rahul Disqualified) విషయంలోనూ కనిపిస్తోంది. అనర్హతపై జూలై 10, 2013 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేలా యూపీఏ-2 తయారు చేసిన ఆర్డినెన్స్ (Ordinance)ను ఆనాడు రాహుల్ గాంధీ చించేశారు. ఆనాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ను అవమానిస్తూ రాహుల్ ఆర్డినెన్స్ కాపీలను చింపివేసిన దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి ఆర్డినెన్స్ లేకపోవడంతో ఇప్పుడు రాహుల్ పై లోక్ సభ సెక్రటరియేట్ అనర్హత వేటు వేయక తప్పలేదు. ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటే.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేలా యూపీఏ-2 తయారు చేసిన ఆర్డినెన్స్ (Rahul Disqualified)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పేరును `దొంగ` పనులకు ఆపాదిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు విచారణ చేసింది. పరువు నష్టం కేసులో రాహుల్ ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్లు జైలు శిక్ష వేసింది. సాధారణంగా రెండేళ్ల పాటు జైలు శిక్ష పడితే చట్టసభలకు అనర్హులు(Rahul Disqualified) అవుతారు. దాని ప్రకారం లోక్ సభ సెక్రటరియేట్ రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు వేసింది. లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటీసు ప్రకారం రాహుల్ దోషిగా తేలిన మార్చి 23 నుండి సభకు అనర్హుడని పేర్కొంది. రాహుల్ గాంధీ ఇప్పుడు పైకోర్టును ఆశ్రయించి తన నేరారోపణపై స్టే తెచ్చుకోవాలి. ఆ తరువాత దాన్ని లోక్ సభ సెక్రటరియేట్ కు అందచేయాలి. అప్పుడు పరిశీలించిన తరువాత అనర్హతను ఎత్తివేయడానికి అవకాశం ఉంది. కానీ, రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టు కూడా సమర్థిస్తే ఎన్నికల్లో పోటీ అంశం కూడా చర్చనీయాంశం కానుంది.
లోక్ సభలో హైడ్రామా నడుమా రాహుల్ ఎంపీ పదవికి అనర్హుడని
ఉదయం నుంచి లోక్ సభలో హైడ్రామా నడుమా రాహుల్ ఎంపీ పదవికి అనర్హుడని లోక్ సభ సెక్రటిరియేట్ ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం లోక్ సభకు చేరుకున్నారు. ఆయన మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కొద్ది క్షణాల తర్వాత లోక్‌సభ వాయిదా పడింది. ఆ తరువాత లోక్ సభ సెక్రటరియేట్ ఆయన మీద అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. మెరుపు వేగంతో జరిగిన ఈ పరిణామానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి భవన్ కు వెళ్లాలని ప్రయత్నించి విఫలం చెందారు.
Also Read : Rahul Gandhi Disqualified: రాహుల్ పై అనర్హత వేటు
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీని అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే వేగవంతమైన చర్యలతో ఆశ్చర్యపోయానని అన్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ ట్వీట్ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడంతో వాయనాడ్ ఎంపీగా రాహుల్ అర్హతను కోల్పోయారు. మార్చి 23 నుంచి లోక్‌సభకు అనర్హులుగా ప్రకటించారని లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అందుకు నిరస్తూ విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్, విపక్ష ధర్నాకు దిగడంతో ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడాన్ని ఆప్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన మరుసటి రోజు (శుక్రవారం) రాహుల్ గాంధీ పార్లమెంటులోని కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లోక్‌సభకు హాజరైన తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటులో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం రాజకీయ దుమారాన్ని రేపింది.
సూరత్ కోర్టు 2019 క్రిమినల్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడాన్ని ఆప్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి, ఇది మాజీ కాంగ్రెస్ చీఫ్‌కు మద్దతుగా నిలిచింది మరియు అధికార పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులను విచారించడం ద్వారా `అనర్హత కుట్ర పన్నిందని” ఆరోపించింది.
Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?
కాంగ్రెస్ నాయకుడు భారత ప్రజాస్వామ్యాన్ని, దాని సాయుధ దళాలను మరియు దేశ సంస్థలను “అవమానించిన” కారణంగా గాంధీ ఇంటిపేర్లందరినీ నిందించలేమని న్యాయ మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం తాజాగా విరుచుకుపడ్డారు.రాహుల్ గాంధీ చాలా అవమానకరమైన వ్యాఖ్య చేసి మొత్తం OBC కమ్యూనిటీని అవమానపరిచారని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు దానిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ” రిజిజు ట్వీట్‌లో చేశారు.’ఓబీసీ కమ్యూనిటీ ఇంటిపేరును రాహుల్ నిరంతరం అవమానించాడు’ అని భూపేందర్ యాదవ్ అన్నారు.
ప్రహ్లాద్ జోషి తర్వాత, ఓబీసీ వర్గాన్ని రాహుల్ గాంధీ అవమానించారని ఆరోపిస్తున్న బీజేపీ నేతల బృందంలో భూపేందర్ యాదవ్ చేరారు.’రాహుల్ గాంధీ నిరంతరం OBC కమ్యూనిటీ ఇంటిపేరును అవమానించారు. అంతే కాదు విదేశీ గడ్డపై దేశం పరువు తీశాడు. పార్లమెంటు, ఓబీసీ సంఘం, న్యాయవ్యవస్థ పరువు తీస్తున్నాడు.’పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ లోక్ సభకు అనర్హుడయ్యారు అంటూ బీజేపీ చెబుతోంది.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్
వాస్తవంగా జూలై 10, 2013 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, దోషులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారత సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయపరమైన పరిష్కారాలు అయ్యే వరకు తమ స్థానాలను నిలుపుకోవడానికి అనుమతించే మునుపటి వైఖరిని తిరస్కరించింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే ఆర్డినెన్స్‌ను రాహుల్ చింపివేయడంతో ఆనాడు ప్రభుత్వం దానిని వెనక్కి తీసుకునేలా చేసింది. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ లేకపోవడంతో రాహుల్ దోషిగా తేలిన 24 గంటల్లో అనర్హుడుగా మిగిలారు. ఇదే దైవలీల అంటే..అంటూ బీజేపీ ఎంపీలు గుర్తు చేస్తున్నారు.

Tags

Related News

Rahul in US: అమెరికాలో సెంగోల్ పై రాహుల్ గళం
సెంగోల్ గురించి మాట్లాడుతూ కోపం మరియు ద్వేషం వంటి సమస్యలను ప్రధాని మోదీ అతని ప్రభుత్వం పరిష్కరించలేవని రాహుల్ గాంధీ(Rahul in US) అన్నారు.