ఈ ఈజీ ట్రిక్ తో మీ పాన్ నంబర్ గుర్తుండిపోతుంది.. ఎలా అంటే?
ఆదాయం పొందే ప్రతి ఒక్కరికీ కూడా పాన్ కార్డ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే చాలా సార్లు తెలియజేసింది.
- By Nakshatra Published Date - 08:37 PM, Wed - 28 December 22
ఆదాయం పొందే ప్రతి ఒక్కరికీ కూడా పాన్ కార్డ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే చాలా సార్లు తెలియజేసింది. పాన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేసుకోమని కూడా పలు సార్లు హెచ్చరించింది. ఈ పాన్ కార్డు చాలా ముఖ్యమైనది. దీనిని అనేక విషయాల్లో గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కొందరు తమ పాన్ కార్డు నంబర్ ను గుర్తు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా మన ఫోన్ నంబర్ 10 అంకెలు ఉంటుంది. అలాగే మన ఆధార్ నంబర్ 12 అంకెలు ఉంటుంది. ఈ రెండింటినీ గుర్తించుకునేవారు పాన్ నంబర్ ను మాత్రం గుర్తుపెట్టుకోలేకపోతారు.
పాన్ నంబర్ కూడా పది అంకెలు ఉంటుంది. అయితే ఇది ఇంగ్లీషు అక్షరాలతో కలిపి ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని గుర్తు పెట్టుకునేందుకు తికమక పడుతుంటారు. అయితే ఓ చిన్న ట్రిక్ తెలిస్తే ఈ పాన్ నంబర్ ను గుర్తు పెట్టుకోవడం సులభం అవుతుంది. పాన్ కార్డు నంబర్ మీకు కేటాయించడం వెనక అందులో మీ వ్యక్తిగత సమాచారం కూడా దాగి ఉంటుంది.
యుటిఐ లేదా ఎన్ఎస్డీఎల్ ద్వారా ఒక క్రమంలో పాన్ కార్డును సిద్ధం చేస్తారు. ఈ నంబర్ ను ఎవరుబడితే వారు కేటాయించడానికి వీలుండదు. ఇది కేవలం ఆదాయపు పన్ను శాఖ మాత్రమే జారీ చేస్తుంది. పాన్ కార్డులో మొదటి ఐదు అక్షరాలు కూడా ఇంగ్లీషు అక్షరాలు ఉంటాయి. ఆ తర్వాత నాలుగు అంకెలు ఉంటాయి. ఇక చివరగా ఒక ఇంగ్లీషువి అక్షరం ఉంటుంది.
పాన్ లో మొదటి మూడు అక్షరాలు ‘A’ నుంచి ‘Z’ వరకూ ఇంగ్లీషు అక్షరాల సిరీస్ లో ఉంటాయి. ఆ తర్వాత నాలుగో అక్షరం మీ పేరు లోని మొదటి అక్షరం అయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఐదో అక్షరం మీ వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అయితే “P” అనే అక్షరాన్ని సూచిస్తుంది. ఇక తర్వాత నాలుగు అంకెలు ఉంటాయి. ఇక చివరగా ఒక ఇంగ్లీషు అక్షరం ఉంటుంది.
Tags
Related News
Duplicate PAN Card: మీ పాన్ కార్డ్ పోయిందా..? నిమిషాల్లో డూప్లికేట్ పాన్ కార్డ్ తయారు చేసుకోండిలా..!
పాన్ కార్డ్ మీ ఆర్థిక స్థితి గురించి చెబుతుంది. ఇది లావాదేవీ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది.