RBI: రూ. 500 నోట్ల ఉపసంహరణపై స్పష్టతనిచ్చిన ఆర్బీఐ.. ఏం చెప్పిందో తెలుసా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రూ.2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు రోజుకు 20వేల రూపాయల చొప
- By Nakshatra Published Date - 02:47 PM, Thu - 8 June 23
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రూ.2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు రోజుకు 20వేల రూపాయల చొప్పున వారి దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను సమీపం బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం లేదు మార్పిడి చేసుకోవడం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రూ. 2000 రూపాయల నోటును రద్దు చేసిన తరువాత రూ.500 నోట్లను కూడా ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందారు. అయితే తాజాగా ఆర్బీఐ ఈ విషయం పై స్పష్టతనిచ్చింది.
రూ.500 నోట్లను ఉపసంహరించుకోవడం అలాగే రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన లేదని స్పష్టతనిచ్చింది. ఇటువంటి ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దని పౌరులకు సూచించింది. ఇటీవల ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 50శాతం ఇప్పటికే బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వీటి విలువ రూ.1.80 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నోట్లన్నీ దాదాపు 85 శాతం డిపాజిట్ల రూపంలోనే బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
వీటిని మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంటుందని అయినప్పటికీ చివరి నిమిషం వరకూ వేచి ఉండవద్దని పౌరులకు సూచించారు. మార్పిడి చేసుకునేందుకుగాను ఆర్బీఐ దగ్గర ఇతర కరెన్సీ కూడా ఉందని తెలిపారు. మరొకవైపు 2018 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల మేర రూ.2.000 నోట్లు చలామణిలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, 2023 మార్చి 31 నాటికి కేవలం రూ.3.62 లక్షల కోట్లు మాత్రమే చాలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. తాజాగా వీటిలో సగం ఇప్పటికే బ్యాంకులకు చేరిందని తెలిపింది. ఉపసంహరణ ప్రకటన చేసిన కేవలం 20 రోజుల్లోనే సగం నోట్లు వెనక్కి రావడం గమనార్హం. మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19న ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు వీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
Related News
Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్ న్యూస్.. రీజన్ ఇదే..!
బ్యాంక్ ఆఫ్ బరోడాకు RBI ఉపశమనం కలిగించింది.