Rs 2000 Notes : రూ.2వేల నోట్లు మార్చుకునే గడువు పొడిగించే ఛాన్స్ ?
Rs 2000 Notes : రూ.2000 నోట్లను ఇంకా మార్చుకోని వారికి కొంత రిలీఫ్ ఇచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
- By Pasha Published Date - 12:32 PM, Fri - 29 September 23

Rs 2000 Notes : రూ.2000 నోట్లను ఇంకా మార్చుకోని వారికి కొంత రిలీఫ్ ఇచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2వేల నోట్లను మార్చుకునే గడువు రేపటి (సెప్టెంబరు 30)తో ముగియబోతోంది. అయితే ఇటీవల వచ్చిన వరుస సెలవులు, పండుగ సీజన్ నేపథ్యంలో 2వేల రూపాయల నోట్లను మార్చుకునే గడువును వచ్చే నెలాఖరు వరకు పొడిగించే దిశగా ఆర్బీఐ ఆలోచిస్తోందంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. దీనిపై రేపు ఉదయం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also read : RGV : ఆమె అందం నుండి వర్మ బయటకు రాలేకపోతున్నాడు..
మీ వద్ద ఇంకా రూ. 2,000 నోట్లు ఉంటే వాటిని డిపాజిట్ చేసి మార్చుకోండి. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఎందుకంటే సెప్టెంబరు 30 తర్వాత ప్రజల వద్ద ఉన్న రూ. 2,000 నోట్ల పరిస్థితి ఏంటనే దానిపై ప్రస్తుతానికి ఆర్‌బీఐ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ. 2,000 నోట్లను లీగల్ టెండర్‌గా కొనసాగిస్తామని ఆర్‌బీఐ చెప్పిన విషయం గమనించడం ముఖ్యం. అంటే గడువు ముగిసిన తర్వాత కూడా రూ.2000 నోటు చట్టబద్ధంగా (Rs 2000 Notes) కొనసాగుతుంది. అయితే ట్రాన్సాక్షన్‌లకు ఆ నోట్లు ఉపయోగపడవు. ఆ తర్వాత వాటిని నేరుగా ఆర్‌బీఐ వద్ద మాత్రమే ఎక్స్ఛేంజ్ చేసుకునే వీలుంటుంది. అయితే ఇందుకోసం నిర్ణీత గడువు (సెప్టెంబరు 30)లోగా బ్యాంకుల్లో ఆ నోట్లను ఎందుకు మార్చుకోలేకపోయారనే వివరాలను అందించాలి.