Rahul Gandhi :రాహుల్ ఎంత పనిచేసావ్ ..కాంగ్రెస్ నేతలు షాక్
అదానీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కి సూచించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది
- By Sudheer Published Date - 09:02 PM, Sun - 29 October 23

పబ్లిక్ సమావేశాల్లో మాట్లాడే క్రమంలో అప్పుడప్పుడు రాజకీయ నేతలు నోరు జారుతుంటారు..దీనిని ప్రత్యర్థి పార్టీలు పట్టుకొని తెగ హడావిడి చేస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. అగ్రనేత రాహుల్ (Rahul Gandhi) వరుసగా అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ (Kabirdham )లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నోరు జారీ బిజెపి నేతలకు చిక్కారు. అదానీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కి సూచించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది. అదాని వంటి పారిశ్రామిక వేత్తల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీనే అని చివరకు రాహుల్ గాంధీయే ఒప్పుకున్నారని బీజేపీ కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
“బీజేపీ అదానీ ప్రయోజనాల కోసం 24X7 సేవ చేస్తోంది. బీజేపీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కూడా అదానీ వంటి వారి కోసం పనిచేస్తున్నారు. కానీ మేము రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల కోసం పని చేస్తున్నాము. ఇదే తేడా” అని రాహుల్ అన్నారు. రాహుల్ ప్రసంగం సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో సీఎం పదవిలో ఉన్న భూపేష్ బఘేల్ కూడా అక్కడే ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు ఆయనే కాదు అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యి..రాహుల్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని ఒకిత్త అవాక్కయ్యారు. దీనిని బిజెపి నేతలు పట్టుకొని సెటైర్లు వేయడం స్టార్ట్ చేసారు.
Read Also : Revanth Reddy : ‘కేసీఆర్ నువ్వో కచరా..నన్ను రేటెంతరెడ్డి అంటావా’ మెదక్ సభలో రేవంత్ ఫైర్