Women of the Year : పూర్ణిమా దేవి.. టైమ్ మేగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’.. ఎవరామె ?
‘హర్‌గిలా ఆర్మీ’ గురించి, పూర్ణిమాదేవి బర్మన్(Women of the Year) గురించి.. ఫ్రాన్స్, కంబోడియా దేశాల్లోని స్కూళ్లలో పాఠాలు చెబుతున్నారు.
- By Pasha Published Date - 01:06 PM, Fri - 21 February 25

Women of the Year : పూర్ణిమాదేవి బర్మన్.. 2025 సంవత్సరం కోసం ‘టైమ్ మేగజైన్’ వెలువరించిన ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో చోటును సంపాదించారు. ఈ లిస్టులో వివిధ దేశాలకు చెందిన 13 మంది మహిళలకు చోటు దక్కింది. ఇందులో మన భారతదేశం నుంచి చోటు పొందిన ఏకైక మహిళ పూర్ణిమ మాత్రమే. ఇంతకీ ఈమె ఎవరు ? పూర్ణిమాదేవికి ఎందుకీ ఘనత దక్కింది ? ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Warangal Bloodshed : ఓరుగల్లులో కత్తుల కల్చర్.. రాజలింగ మూర్తి హత్య తర్వాత వరుస రక్తపాతాలు
పూర్ణిమాదేవి బర్మన్ నేపథ్యం..
- 45 ఏళ్ల పూర్ణిమాదేవి బర్మన్ అస్సాం వాస్తవ్యురాలు.
- ఆమెకు చిన్నప్పటి నుంచి ప్రకృతి, పక్షులు అంటే చాలా ఇష్టం. అందుకే పూర్ణిమ జువాలజీలో పీజీ చేసింది.
- అసోం రాష్ట్రంలో ఉండే గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన పెద్ద కొంగలపై పీహెచ్‌డీ చేయాలని అనుకున్నారు.
- గ్రేటర్ అడ్జటంట్ జాతి పెద్ద కొంగలు అంతరించిపోవడాన్ని పూర్ణిమ గుర్తించారు. వాటి సంరక్షణకు ప్రయత్నించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
- గ్రేటర్ అడ్జటంట్ జాతి పెద్ద కొంగలను సంరక్షించేందుకు 2007 సంవత్సరంలో కొందరు మహిళలతో కలిసి ‘హర్‌గిలా ఆర్మీ’ (Hargila Army) అనే బృందాన్ని పూర్ణిమాదేవి బర్మన్ ఏర్పాటు చేశారు.
- అసోం రాష్ట్రంలో 2007 సంవత్సరం నాటికి గ్రేటర్ అడ్జటంట్ జాతి పెద్ద కొంగలు 450 మాత్రమే ఉండేవి.
- పూర్ణిమాదేవి బర్మన్‌కు చెందిన ‘హర్‌గిలా ఆర్మీ’ చేసిన ప్రయత్నాలు ఫలించడం వల్ల 2023 నాటికి గ్రేటర్ అడ్జటంట్ జాతి పెద్ద కొంగల సంఖ్య ఏకంగా 1800 దాటింది. ఈవివరాలను ‘టైమ్ మేగజైన్’ నివేదికలో ప్రస్తావించారు.
- ‘హర్‌గిలా ఆర్మీ’ గురించి, పూర్ణిమాదేవి బర్మన్(Women of the Year) గురించి.. ఫ్రాన్స్, కంబోడియా దేశాల్లోని స్కూళ్లలో పాఠాలు చెబుతున్నారు.
- గ్రేటర్ అడ్జటంట్ జాతి పెద్ద కొంగలను అసోం రాష్ట్ర కల్చర్‌లో భాగంగా పరిగణిస్తారు.
- ప్రస్తుతం పూర్ణిమకు చెందిన ‘హర్‌గిలా ఆర్మీ’లో దాదాపు 20 వేల మంది మహిళలు ఉన్నారు. వీరంతా కొంగలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. అస్సాం సంప్రదాయ దుస్తులపై కొంగ బొమ్మలు గీసి అక్కడికి వచ్చిన పర్యాటకులకు విక్రయిస్తుంటారు. దీనివల్ల వారికి జీవనోపాధి లభిస్తుంది.