Rahul, Priyanka Health : ప్రియాంకు కరోనా, రాహుల్ అనారోగ్యం
ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి స్వల్ప అస్వస్థత కలిగింది. అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు.
- Author : Hashtag U
Date : 10-08-2022 - 4:26 IST
Published By : Hashtagu Telugu Desk
ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి స్వల్ప అస్వస్థత కలిగింది. అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఆయన రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో పర్యటించాలి. అయితే, అనారోగ్యం కారణంగా ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. కాం గ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక మరోసారి కరోనా బారినపడ్డారు. ట్విట్టర్ ఆ విషయాన్ని ఆమె తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. ప్రియాంక కరోనా పాజిటివ్ గా తేలడం ఇది రెండోసారి. జూన్ లో ఆమె తొలిసారి కరోనా బారిన పడ్డారు. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి పాజిటివ్ గా తేలింది.
ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆమె కోలుకున్నారు.