Priyanka Gandhi : ప్రియాంకకు 7 లక్షల మెజారిటీ టార్గెట్.. వయనాడ్ బైపోల్‌కు కాంగ్రెస్ కసరత్తు
7 లక్షల భారీ మెజారిటీయే టార్గెట్‌గా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు.
- By Pasha Published Date - 04:05 PM, Wed - 17 July 24

Priyanka Gandhi : 7 లక్షల భారీ మెజారిటీయే టార్గెట్‌గా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు. ఇందుకోసం వయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకముందే.. వయనాడ్‌లో ఎన్నికల వాతావరణం నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join
ప్రియాంకాగాంధీ 7 లక్షల మెజారిటీని సాధించేందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో కసరత్తు చేయాలని పార్టీ క్యాడర్‌కు కాంగ్రెస్ పెద్దలు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లోని పార్టీలు యాక్టివ్ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ కురుస్తున్న జోరువానలను కూడా లెక్క చేయకుండా ప్రజలతో మమేకం అవుతున్నాయి. వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ సైన్ బోర్డులు పెద్దఎత్తున వెలిశాయి. అన్ని వర్గాల ప్రజలతో కాంగ్రెస్ శ్రేణులు కలిసి.. ప్రియాంకను(Priyanka Gandhi) గెలిపించాలని కోరుతున్నాయి.
Also Read :Allu Arjun Pushpa 2 : మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా పుష్ప 2 ఆ టార్గెట్ సాధ్యమా..?
హైకమాండ్ సూచనల మేరకు ప్రియాంకాగాంధీకి భారీ మెజారిటీని సాధించేందుకు వయనాడ్ కాంగ్రెస్ నేతలు తమ బృందాలను సమాయత్తం చేస్తున్నాయని ఆ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు ఓవీ అప్పచ్చన్ తెలిపారు. ఇందులో భాగంగా తొలిదశలో అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సమావేశాలు, ఆ తర్వాత ర్యాపిడ్ ఫీడర్ బాడీ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇకపై అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా ఘోరంగా ఓడిపోవడంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి సీపీఐ కేరళ విభాగం మరోసారి అభ్యర్థిని నిర్ణయించలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దింపడంతో ఆ పార్టీ డైలమాలో పడింది.
Also Read :Nerella : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నేరళ్ల శారద
- 2019 వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 7,06,367 ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఆయన మెజారిటీ 4,31,770 ఓట్లు.
- 2024 వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 6,47,445 ఓట్లు రాగా, మెజారిటీ 3,64,422 ఓట్లకు చేరింది.