Prabhas: అతనొక్కడే.. సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా మన డార్లింగ్!
కేవలం ఒకే ఒక్క మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు ప్రభాస్. తెలుగు బ్లాక్బస్టర్ మిర్చి, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, బాహుబలి, సాహో లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.
- By Balu J Published Date - 03:02 PM, Sat - 11 December 21
కేవలం ఒకే ఒక్క మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు ప్రభాస్. తెలుగు బ్లాక్బస్టర్ మిర్చి, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, బాహుబలి, సాహో లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. UKకి చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ న్యూస్ పేపర్ ప్రచురించిన జాబితాలో 50 మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే వాళ్లందరినీ వెనక్కినెట్టి బాహుబలి స్టార్ ప్రభాస్ 2021కి ప్రపంచంలోనే నంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా నిలిచాడు. ‘‘సినిమా, టెలివిజన్, సాహిత్యం, సంగీతం ప్రపంచంలోని అనేక మంది గ్లోబల్ స్టార్స్ కంటే ప్రభాస్ ముందున్నాడు.
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు ప్రభాస్. ప్రాంతీయ సినిమాలు కూడా దేశవిదేశాల్లో సైతం ఆడుతాయని నిరూపించాడు. ప్రభాస్ ఇన్పిరేషన్ తో ప్రాంతీయ సినిమాలు అనేక భాషల్లో విడుదలవుతున్నాయి’’ అని ఈస్టర్న్ ఐ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ అస్జాద్ నజీర్ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సాలార్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు చేస్తున్నాడు. పూజా హెగ్డే నటించిన ప్రభాస్ రాధే శ్యామ్ జనవరి 14, 2022న భారతదేశంలో విడుదల కానుంది.
బ్రిటీష్ పాకిస్తానీ నటుడు, సంగీతకారుడు రిజ్ అహ్మద్ హాలీవుడ్లో రెండో స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో ఉన్న ప్రియాంక చోప్రా, భారతీయ-అమెరికన్ మిండీ కాలింగ్ నాలుగో స్థానంలో నిలిచారు. సింగర్ శ్రేయా ఘోషల్ (5వ) స్థానం దక్కించుకోగా, పాకిస్థాన్లో జన్మించిన అమెరికన్ నటుడు కుమైల్ నంజియాని ఆరు, పాకిస్థానీ నటుడు సజల్ అలీ ఏడు, బ్రిటిష్-భారత పాప్ సూపర్ స్టార్ చార్లీ ఎక్స్ సీఎక్స్ (ఎనిమిది), బ్రిటిష్ నటుడు దేవ్ పటేల్ (తొమ్మిది) షెహనాజ్ గిల్ (10) స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్ (32), 18 ఏళ్ల నటి సుంబుల్ తౌకీర్ ఖాన్ (16) ఉన్నారు.
Tags
Related News
Baahubali : కట్టప్ప విలన్గా బాహుబలి యానిమేషన్ సిరీస్.. ట్రైలర్ చూసారా..?
బాహుబలి యానిమేషన్ సిరీస్ ట్రైలర్ చూసారా..? కట్టప్ప విలన్గా మారితే బాహుబలి, భల్లాలదేవ కలిసి అతడి పై యుద్ధం చేస్తున్నారు.