Mann Ki Baat : ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదు.. ధైర్యం, దేశభక్తి కూడా : ప్రధాని మోడీ
అనేక ఇతర నగరాల్లో జన్మించిన పిల్లలకు 'సిందూర్' అని పేర్లు కూడా పెట్టుకున్నారు’’ అని మోడీ(Mann Ki Baat) ఈసందర్భంగా చెప్పారు.
- By Pasha Published Date - 12:06 PM, Sun - 25 May 25

Mann Ki Baat : ఆపరేషన్ సిందూర్ అనేది సైనిక చర్య మాత్రమే కాదని.. ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి అది నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ ప్రజలంతా భావోద్వేగానికి గురయ్యారని ఆయన చెప్పారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసిందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తొలిసారిగా ఈరోజు (ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు.
Also Read :Fourth Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. టాప్ -10లో ఉన్న దేశాలివీ
ఆ పిల్లలకు ‘సిందూర్’ అని పేరు పెట్టుకున్నారు
‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత దేశమంతా ఏకమైంది. ఆపరేషన్ సిందూర్‌లో మన సైన్యం చూపించిన ధైర్య సాహసాలకు ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది’’ అని మోడీ తెలిపారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి కోసం ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత సైన్యం వినియోగించిన ‘మేడిన్ ఇండియా’ రక్షణ పరికరాలను ఆయన కొనియాడారు. ‘‘భారతదేశంలో తయారైన ఆయుధాలు, రక్షణ రంగ పరికరాలు, సాంకేతికత యొక్క శక్తిని ప్రపంచ దేశాలు చూశాయి. ఈ విజయం ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పంతో సాకారమైంది. మన ఇంజినీర్లు, మన సాంకేతిక నిపుణుల శ్రమ వల్లే ఈ విజయం దక్కింది’’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.‘‘ఆపరేషన్ సిందూర్ జరుగుతుండగా బిహార్‌లోని కతిహార్, యూపీలోని కుషినగర్, అనేక ఇతర నగరాల్లో జన్మించిన పిల్లలకు ‘సిందూర్’ అని పేర్లు కూడా పెట్టుకున్నారు’’ అని మోడీ(Mann Ki Baat) ఈసందర్భంగా చెప్పారు.
Also Read :Dogs Vs Cancer : కుక్కలు క్యాన్సర్‌ను కూడా పసిగడతాయ్.. ఎలాగో తెలుసా ?
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆకాశ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థను భారత్ వినియోగించింది. ఇది పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకొని కూల్చేసింది. నియంత్రణ రేఖ వెంట పెద్దసంఖ్యలో టీ-72 యుద్ధ ట్యాంకులను మోహరించారు. ఇజ్రాయెల్ సహకారంతో భారత్ అభివృద్ధి చేసిన స్కై స్ట్రైకర్ లాయిటరింగ్ మునిషన్స్‌ను కూడా భారత ఆర్మీ వినియోగించింది.