PM Modi: జర్మనీ పర్యటన ముగించుకున్న నరేంద్ర మోదీ!
జర్మనీ పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలు దేరి వెళ్లారు.
- By Balu J Published Date - 07:18 PM, Tue - 28 June 22

జర్మనీ పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలు దేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన UAEకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. ఈ ఏడాది మే 13న కన్నుమూసిన యూఏఈ మాజీ అధ్యక్షులు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు నివాళులర్పిస్తారు.2004 నుంచి యూఏఈ అధ్యక్షులుగా ఉన్న 73 ఏళ్ల ఖలీఫా బిన్ జాయెద్.. అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
జర్మనీ వేదికగా మ్యూనిచ్‌లో జరిగిన గ్రూప్-7 దేశాల సదస్సు సంతృప్తికరంగా సాగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రపందేశాల శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత తదితర అంశాలపై ఆయా దేశాధినేతలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఈ సదస్సు తనకెన్నో అనుభూతులు మిగిల్చిందని ప్రధాని తెలిపారు.