PM Modi: తల్లి పాడే మోసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో ప్రధాని మోదీ (PM Modi) తల్లి హీరాబెన్ (Heeraben) అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని మోదీ తన తల్లి అంత్యక్రియల చితికి నిప్పంటించి, చేతులు జోడించి అంతిమ నివాళులు అర్పించారు. అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన హీరాబెన్ కు
- By Gopichand Published Date - 10:10 AM, Fri - 30 December 22

గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో ప్రధాని మోదీ (PM Modi) తల్లి హీరాబెన్ (Heeraben) అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని మోదీ తన తల్లి అంత్యక్రియల చితికి నిప్పంటించి, చేతులు జోడించి అంతిమ నివాళులు అర్పించారు. అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన హీరాబెన్ కు సోదరుడు సోమాభాయ్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు నిబ్బరంగా ఉన్న ప్రధాని మోడీ, అభిమానంతో వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ పాడే మోశారు.
గాంధీనగర్‌లోని సెక్టార్-30 శ్మశానవాటికలో ఆయనతో పాటు అతడి సోదరులు చితికి నిప్పు అంటించారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ అంతిమయాత్రకు ముందు తల్లి పాడె మోశారు మోదీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కన్నీరు పెడుతూ తల్లికి తుది వీడ్కోలు పలికారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే గుజరాత్ వెళ్లి మోదీ నివాళి అర్పించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
https://twitter.com/i/status/1608657708382826498
హీరాబెన్ మోదీ 30/12/2022 తెల్లవారుజామున 3.30 గంటలకు UN మెహతా హార్ట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు అని మెడికల్ బులెటిన్ తెలిపింది. హీరాబెన్ మోదీ మరణ వార్త తెలియగానే దేశ వ్యాప్తంగా నివాళులర్పించారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి హీరాబెన్ గాంధీనగర్ సమీపంలోని రేసన్ గ్రామంలో నివసించారు.