PM Modi : ప్రధాని మోడీ హత్యకు బీహార్లో కుట్ర
బీహార్లో ప్రధాన మోడీ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఆ విషయాన్ని బీహార్ నిఘా విభాగం తెలుసుకుని ఉగ్రవాదుల వ్యూహాలను ఛేదించారు.
- By CS Rao Published Date - 11:42 AM, Thu - 14 July 22

బీహార్లో ప్రధాన మోడీ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఆ విషయాన్ని బీహార్ నిఘా విభాగం తెలుసుకుని ఉగ్రవాదుల వ్యూహాలను ఛేదించారు. పాట్నాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్న లక్ష్యంగా ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. ప్రధాని మోదీ హత్యను రెండో లక్ష్యంగా పెట్టుకున్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఈనెల 12న ఆయన్ను హత్య చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు ప్రాథమికంగా దర్యాప్తు అనంతరం బీహార్ పోలీసులు ప్రకటించారు.
ఉగ్రవాదులు అస్థార్ పర్వేజ్, జలూలుద్దీన్ అనే ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పాట్నాలోని పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదులు శిక్షణ పొందినట్టు గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యం బయటపడింది. తొలుత పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలిసింది. వెంటనే బీహార్ పోలీసులకు, ఎన్ఐఏకు సమాచారం చేరవేసింది. రంగంలోకి దిగిన ఎన్ ఐ ఏ , బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఉగ్రవాదులను పట్టుకొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి యూత్ పుల్వామా షరీఫ్ ప్రాంతానికి వచ్చి ఉగ్రవాదంలో శిక్షణ తీసుకుంటున్నట్టు గుర్తించడం విశేషం. పెద్ద కుట్రను ఛేదించడంతో ఉగ్రవాదుల శిక్షణ వ్యవహారం బట్టబయలు అయింది.