NDA Meeting : ప్రధాని సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
NDA Meeting : ఈ సమావేశంలో దేశ భద్రతా అంశాలు, కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలు, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక ప్రయోగాలు, కులగణన వంటి సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
- Author : Sudheer
Date : 25-05-2025 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీ అశోక హోటల్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ అత్యున్నత స్థాయి సమావేశం (NDA High-Level Meeting) దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యారు. ఇది ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక సమావేశానికి హాజరుకావడం మొదటిసారి కావడం విశేషం.
Spirtual: ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరిగాయా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?
ఈ సమావేశంలో దేశ భద్రతా అంశాలు, కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలు, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక ప్రయోగాలు, కులగణన వంటి సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అభివృద్ధి, శాంతి భద్రతలపై సమగ్ర దృష్టితో సమావేశం కొనసాగింది.
పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొనడం ద్వారా కేంద్ర పాలనలో ఏపీకి ప్రాధాన్యత పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి, కేంద్ర నిధుల కేటాయింపులు, రాజకీయ భాగస్వామ్యంపై పవన్ కేంద్ర నాయకులతో చర్చించే అవకాశముందని భావిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా జనసేనకు రాజకీయంగా ఈ భేటీ మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది.