‘Pawan Kalyan’ : ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపెయిన్ గా ‘పవన్ కళ్యాణ్’..?
Pawan Kalyan : మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ సత్తాను వాడకుని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బిజెపి పెద్దలు సిద్ధం అవుతున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ “తమిళనాడు”.
- By Sudheer Published Date - 10:13 PM, Mon - 25 November 24

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లోకల్ కాదు నేషనల్ అని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితం అన్నట్లు కొంతమంది రాజకీయ నేతలు భావించిన..ప్రధాని మోడీ మాత్రం పవన్ లో పవర్ ఉంది..ఆ పవర్ ఎక్కడైనా పనిచేస్తుందని నమ్మాడు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను వాడుకొని సక్సెస్ అయ్యాడు.
తాజాగా మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో (Maharashtra Elections) మహాయుతి ప్రభంజనం (Mahayuti alliance) సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ సాధించడం తో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి హావ నడుస్తుందని..ప్రజలంతా బిజెపినే కోరుకుంటున్నారని మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో రుజువైంది.288 స్థానాలకుగాను అధికార కూటమి 234 స్థానాల్లో విజయం సాధించగా.. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరుఫున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లాతూర్, షోలాపూర్ సహా పలుచోట్ల మహాయుతి కూటమి అభ్యర్థుల తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. బహిరంగసభలతో పాటుగా ర్యాలీలలో పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పవన్ కళ్యాణ్ వల్లే ఈరోజు తాము విజయం సాధించామని పబ్లిక్ గా తేల్చి చెప్పారు. దీంతో పవన్ సత్తా ఏంటో నేషనల్ వైడ్ గా రాజకీయ నేతలకే కాదు ప్రజలకు సైతం అర్థమైంది. ఈ క్రేజ్ ను పూర్తిగా వాడుకునేందుకు బీజేపీ చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ జనసేన అధ్యక్షుడ్ని తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా? సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనాని ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపెయిన్ కానున్నారా? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ సత్తాను వాడకుని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బిజెపి పెద్దలు సిద్ధం అవుతున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ “తమిళనాడు”. మరో ఏడాదిన్నర లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపీకి, సంఘపరివార్‌కు తమిళనాడు ఎప్పుడూ కొరకని కొయ్యే. అక్కడ రాజకీయమంతా డీఎంకే, అన్నా డీఎంకే ల మధ్యే నడుస్తుంటుంది. అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వడంలేదు. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలితల అస్తమయం తరువాత పరిస్థితులు కొంత మారాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో బిజెపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. అక్కడ విజయానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ సోలోగా 133 సాధించింది. అంత బలంగా ఉన్న డీఎంకేను ఢీ కొట్టడం అంత సామాన్యమైన పని కాదు. ఇలాంటి తరుణంలో కాషాయ నేతలకు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ కు తమిళనాట కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సనాతన ధర్మం బేస్ చేసుకుని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు, ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పటికే తమిళనాట కాకరేపాయి. సో ఇప్పుడు మహారాష్ట్రలో ఎలాగైతే సనాతన ధర్మం తో ఓటర్లను ఆకట్టుకున్నారో..ఇప్పుడు తమిళనాట కూడా అదే అసత్రాన్ని ఎజెండాగా చేసుకొని బరిలోకి పవన్ కళ్యాణ్ ను దింపాలని బిజెపి ప్లాన్ చేస్తుంది. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరగడమే కాదు మోడీ కి కుడి భుజం గా మారే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ కు ఉంది. చూద్దాం మరి ఏంజరుగుతుందో..!!
Read Also : Balineni Vs Chevireddy : అదానీ అంశం.. చెవిరెడ్డి, బాలినేని వాగ్వాదం