Tragedy : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 14 మంది మృతి
Tragedy : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ఘోర విషాదానికి వేదికైంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న భవన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
- By Kavya Krishna Published Date - 10:25 AM, Thu - 28 August 25

Tragedy : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ఘోర విషాదానికి వేదికైంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న భవన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. విరార్‌లోని నారంగి ఫాటా వద్ద రాము కాంపౌండ్‌లో ఉన్న రమాబాయి అపార్ట్‌మెంట్ నాలుగంతస్తుల భవనంలోని వెనుక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన శిథిలాలు పక్కనే ఉన్న చాల్ (చిన్న ఇళ్ల సముదాయం) మీద పడి పెద్ద ప్రమాదానికి దారితీశాయి.
Shubman Gill: టీమిండియాకు శుభవార్త.. గిల్ ఆరోగ్యం ఎలా ఉందంటే?
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వసాయ్–విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. రాత్రంతా శిథిలాలు తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇప్పటివరకు 11 మందిని సురక్షితంగా రక్షించారు. గాయపడిన వారిని విరార్, నలసోపారా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.
సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్‌ను అధికారులు ఇప్పటికే ప్రమాదకర భవనంగా గుర్తించి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ అక్కడ నివాసం కొనసాగింది. శిథిలాల కింద ఇంకా 10 నుంచి 11 మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
Retire From IPL: అశ్విన్ తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే క్రికెటర్లు వీరేనా!