Oppn leaders: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ‘ప్రతిపక్షం’ నిరసనలు
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా.. రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీ నాయకులు మార్చ్ నిర్వహించనున్నారు.
- Author : hashtagu
Date : 14-12-2021 - 12:52 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా.. రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీ నాయకులు మార్చ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం , రైతుల కనీస మద్దతు ధర, పార్లమెంటులో చర్చ లేకుండా బిల్లులు ఆమోదించే విధానాలపై నిరసనగా.. పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించనున్నారు. ఈ విషయంపై పార్లమెంటులోని ప్రతిపక్ష నాయకులు మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు శీతాకాల సమావేశాల ఆఖరి రోజు డిసెంబర్ 23 వరకు మహాత్మగాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష కూడా చేపట్టనున్నారు.