Gujarat : సీఎం సభలో పడుకున్న అధికారి.. విధి నిర్లక్ష్యం అంటూ సస్పెండ్..
సీఎం మాట్లాడేటప్పుడు సభలో ముందు వరుసలోనే కూర్చున్న ఓ అధికారి హాయిగా నిద్రపోయాడు.
- By News Desk Published Date - 10:24 PM, Sun - 30 April 23
కొంతమంది అధికారులు(Officers), ప్రజాప్రతినిధులు సభల్లో, ఆఫీసుల్లో నిద్రపోతూ(Sleep) నిర్లక్షానికి ప్రతినిధులుగా నిలుస్తారు. తాజాగా ఇలాగే ఓ అధికారి ఏకంగా సీఎం(CM) సభలో సీఎం మాట్లాడుతుండగా నిద్రపోవడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు.
గుజరాత్ లోని భుజ్ లో భూకంప బాధితులకు పునరావాసం కల్పిస్తూ ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. అర్హులైన వారికి ఆ ఇళ్ల పట్టాలను సీఎం చేతుల మీదుగా అందించారు. అనంతరం సీఎం భూపేంద్ర పటేల్ సభలో మాట్లాడారు. అయితే సీఎం మాట్లాడేటప్పుడు సభలో ముందు వరుసలోనే కూర్చున్న ఓ అధికారి హాయిగా నిద్రపోయాడు.
సీఎం సభలో అధికారి పడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై సీరియస్ అయి ఆ వీడియోలో కనిపిస్తున్న అధికారి భుజ్ మునిసిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం నిబంధనల ప్రకారం ఆయనను విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేశారు.
Also Read : TDP MLA Husband Arrested: రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు అరెస్ట్
Related News
Love Marriages: ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి: సీఎం భూపేంద్ర పటేల్
గుజరాత్ లో ప్రేమ వివాహాలకు (Love Marriages) తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat CM) భూపేంద్ర పటేల్ వెల్లడించారు.