Free Tea Scheme : టీ ఫ్రీ స్కీమ్.. ఎక్కడ.. ఎందుకు ?
Free Tea Scheme : టీ ఫ్రీ స్కీమ్.. ఔను నిజమే.. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లకు ఉచితంగా టీని అందించే ఏర్పాట్లను ఒడిశా రవాణా శాఖ చేసింది.
- By Pasha Published Date - 09:37 AM, Fri - 22 December 23

Free Tea Scheme : టీ ఫ్రీ స్కీమ్.. ఔను నిజమే.. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లకు ఉచితంగా టీని అందించే ఏర్పాట్లను ఒడిశా రవాణా శాఖ చేసింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, డ్రైవర్ల నిద్రమత్తును పారదోలేందుకు ఒడిశా ప్రభుత్వం టీని ఫ్రీగా అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. రహదారులపై ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీని పంపిణీ చేస్తామని, ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఒడిశా సర్కారు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
- డ్రైవర్లు టీ తాగి కాసేపు రెస్ట్ తీసుకునేలా ట్రక్ టెర్మినల్స్, వేసైడ్ ఎమినిటీ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
- సరుకు రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు రాత్రి టైంలో నిద్రలేమితో ఉంటారని, అందుకే వారికి టీ ఇచ్చి అలర్ట్ చేస్తున్నామని పేర్కొంది.
- ఒడిశాలోని 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాటిలో లారీ డ్రైవర్లు నిద్రించడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు ఉంటాయని వివరించింది. అక్కడ చాయ్, కాఫీలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
- గత ఐదేళ్లలో ఒడిశా రాష్ట్రంలో 54,790 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 25,934 మంది చనిపోగా, 51,873 మంది గాయపడ్డారు.
Also Read: India – Shortest Day : ఇవాళ ఇండియాలో పగలు చిన్నది.. రాత్రి పెద్దది.. ఎందుకు ?
ఓ సర్వే ప్రకారం భారతదేశ జనాభాలో 64 శాతం మంది రోజూ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే వారిలో 30 శాతం కంటే ఎక్కువ మంది సాయంత్రం టీ తాగుతారు. ప్రతిరోజూ సాయంత్రం టీ తాగడానికి ఇష్టపడే వారిలో మీరూ ఒకరిగా ఉన్నారా? అవును అయితే, సాయంత్రం టీ మీ ఆరోగ్యానికి మంచి అలవాటు అవునో.. కాదో కూడా తెలుసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రవేళకు 10 గంటల ముందు కెఫిన్ నివారించాలి. అలా చేయడం వల్ల కాలేయం నిర్విషీకరణలో సహాయపడుతుంది. అలా చేస్తేనే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రి షిఫ్టులో పనిచేసే వారికి సాయంత్రం పూట టీ తాగడం హానికరం కాదు. కానీ ఎక్కువగా తాగొద్దు. నిద్ర సమస్యలు లేని వారు సాయంత్రం పూట టీ తాగవచ్చు.రోజూ సమయానికి ఆహారం తీసుకునే వారు సాయంత్రం పూట టీ తాగవచ్చు.