Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄Nitish Kumar To Skip Pm Modis Meeting 2nd Time In A Month

Nitish Kumar : ఎన్టీయేకి దూరంగా బీహార్ సీఎం?

ఎన్టీయేకు బీహార్ సీఎం నితీష్ కుమార్ దూరం జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

  • By CS Rao Published Date - 05:30 PM, Sat - 6 August 22
Nitish Kumar : ఎన్టీయేకి దూరంగా బీహార్ సీఎం?

ఎన్టీయేకు బీహార్ సీఎం నితీష్ కుమార్ దూరం జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. నెల వ్య‌వ‌ధిలో రెండోసారి ప్ర‌ధాన మంత్రి స‌మావేశానికి నితీష్ డుమ్మా కొట్టారు. ఢిల్లీలో జ‌రిగే నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశానికి రావ‌డంలేద‌ని ఆ పార్టీ వెల్ల‌డించింది. సీఎంల‌కు మాత్ర‌మే ఈ మీటింగ్ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఢిల్లీలో సోమవారం ప్రధాని అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ నుంచి ప్రతినిధులెవరూ లేరని తెలుస్తోంది.

కోవిడ్-19 నుండి ఇప్పుడే కోలుకున్న నితీష్ కుమార్ తన డిప్యూటీని పంపాలని అనుక‌న్నారు. కానీ, ఆ కార్యక్రమం ముఖ్యమంత్రులకు మాత్రమే అంటూ కండిష‌న్ ఉండ‌డంతో బీహార్ నుంచి ప్ర‌తినిధులు ఎవ‌రూ హాజ‌రు కావ‌డంలేదు. అయితే, ముఖ్యమంత్రి నితీష్ సోమవారం జనతా దర్బార్‌ను నిర్వహించబోతున్నారు. ఆరోగ్యం, ఇతరత్రాల‌ కారణంగా గత కొన్ని వారాలుగా రద్దు చేయబడిన ఈవెంట్‌ను తిరిగి ప్రారంభిస్తార‌ని తెలిసింది.

రాష్ట్ర అభివృద్ధి ర్యాంకింగ్స్‌లో బీహార్‌ను అట్టడుగున ఉంచిన నీతి ఆయోగ్‌పై కుమార్ చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు, గత నెలలో, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు కూడా ఆయ‌న. దూరంగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచిన ముఖ్యమంత్రుల సమావేశానికి కూడా డిప్యూటీ సీఎంను పంపారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ, నితీష్‌ కుమార్ ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్య‌త‌లు తీసుకున్న కొన్ని రోజుల‌కు బీజేపీతో నితీష్ కుమార్ విభేదాలు మొదలయ్యాయి. ఇప్పుడు, అగ్నిపథ్ పథకం, కుల గణన, బిజెపికి చెందిన బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాతో కుమార్ పోటీ ప‌డ‌డంతో పాటు రెండు పార్టీల మధ్య వాగ్వాదం దాదాపు సాధారణ వ్యవహారంగా మారింది.

Tags  

  • alternative to NDA
  • Bihar CM Nitish Kumara
  • pm modi

Related News

Modi Rakhi : మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

Modi Rakhi : మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

  • Prashant Kishor: బీజేపీతో ఇమడలేకే నితీశ్ బయటికొచ్చాడు : పీకే

    Prashant Kishor: బీజేపీతో ఇమడలేకే నితీశ్ బయటికొచ్చాడు : పీకే

  • Modi, Chandrababu : ఔను! వాళ్లిద్ద‌రూ మ‌ళ్లీ భేటీ ఖాయం!!

    Modi, Chandrababu : ఔను! వాళ్లిద్ద‌రూ మ‌ళ్లీ భేటీ ఖాయం!!

  • Aug 15 : భార‌త ప్ర‌జ‌ల‌కు ఆగ‌స్ట్ 15న ప్ర‌ధాని భారీ గిఫ్ట్

    Aug 15 : భార‌త ప్ర‌జ‌ల‌కు ఆగ‌స్ట్ 15న ప్ర‌ధాని భారీ గిఫ్ట్

  • Modi Assets : స్థిరాస్తిలేని ప్ర‌ధాని మోడీ, మొత్తం ఆస్తి రూ. 2.23 కోట్లు

    Modi Assets : స్థిరాస్తిలేని ప్ర‌ధాని మోడీ, మొత్తం ఆస్తి రూ. 2.23 కోట్లు

Latest News

  • Road Accident : యూపీ లో డీసీఎం వాహ‌నాన్ని ఢీకొట్టిన బ‌స్సు.. 30 మందికి గాయాలు

  • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Gorantla Issue: గోరంట్ల బూతు వీడియో పై ‘నార్త్’ ఫైట్

  • AP Politics: సోలో గేమ్ సో బ్యాడ్

  • Jagga Reddy: జగ్గారెడ్డి మౌనం వెనుక మతలబు

Trending

    • Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    • Floods in Death Valley..!: ప్రపంచంలోనే వేడి ప్రదేశం.. అక్కడ వరదలు..!

    • Ambidexterity: రెండు చేతులతో అద్భుతంగా రాస్తున్న చిన్నారి.. వీడియో వైరల్?

    • Grooms For Sale: బాబోయ్.. అమ్మాయిలకు పెళ్ళికొడుకులను అమ్మేస్తున్న జనాలు.. ఎక్కడంటే?

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: