Sonia Gandhi- INDIA Chairperson : “ఇండియా” కూటమి ఛైర్‌పర్సన్ గా సోనియా గాంధీ ?
Sonia Gandhi- INDIA Chairperson : మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో జరిగే విపక్ష పార్టీల కూటమి "ఇండియా" మీటింగ్ లో కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు.
- By Pasha Published Date - 06:43 PM, Sun - 6 August 23

Sonia Gandhi- INDIA Chairperson : మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో జరిగే విపక్ష పార్టీల కూటమి “ఇండియా” మీటింగ్ లో కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. “ఇండియా” కూటమికి సారధ్యం వహించే నేతలు ఎవరు అనేది ఆ సమావేశంలో తేలిపోనుంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఇండియా కూటమి కన్వీనర్ పోస్టులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను నియమించనున్నారు. కూటమి ఛైర్‌పర్సన్- కన్వీనరు గా సోనియా గాంధీని ఎంపిక చేస్తారని అంటున్నారు.
Also read : Ola Scooter: నెలకు రూ.2 వేలతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. మీ సొంతం?
ఛైర్‌పర్సన్ హోదాలో ఇండియా కూటమిలోని 11 మంది సభ్యుల సమన్వయ కమిటీకి ఆమె సారధ్యం(Sonia Gandhi- INDIA Chairperson) వహిస్తారని చెబుతున్నారు. ఒకవేళ ఆ పదవిని చేపట్టేందుకు సోనియా గాంధీ ఆసక్తి చూపకుంటే.. ఆమె సూచించే నేతకు ఆ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. కూటమిలోని పార్టీల మధ్య రాష్ట్రాలవారీగా సీట్ల పంపిణీ ఎలా జరగాలి ? ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి ? అనే దానిపైనా “ఇండియా” మీటింగ్ లో చర్చ జరగనుంది.