1st Eight Lane Highway : దేశంలోనే తొలి 8 లేన్ల హైవే రెడీ.. చూద్దాం రండి !
1st Eight Lane Highway : మన దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల హైవే ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పుడది తుది మెరుగులు దిద్దుకుంటోంది. పనులు చివరి దశలో ఉన్నాయి.
- By Pasha Published Date - 12:22 PM, Mon - 21 August 23

1st Eight Lane Highway : మన దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల హైవే ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పుడది తుది మెరుగులు దిద్దుకుంటోంది. పనులు చివరి దశలో ఉన్నాయి. రూ.9,000 కోట్ల భారీ బడ్జెట్ తో 27.6 కి.మీ మేర ఈ అతిపెద్ద హైవేను కేంద్ర సర్కారు నిర్మించింది. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని మహిపాల్‌పూర్ వరకు నిర్మించిన ఈ హైవే పేరు.. “ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే”!!
ఈఫిల్ టవర్ రేంజ్ లో..
ఈ హైవేకి సంబంధించిన రోడ్డు వెడల్పు 34 మీటర్లు.. ఈ భారీ జాతీయ రహదారి ప్రాజెక్టు కోసం ఏకంగా 1200 చెట్లను నరికేసి.. తిరిగి నాటాల్సి వచ్చింది. దీని కన్ స్ట్రక్షన్ కు మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఇది ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఈఫిల్ టవర్ (1st Eight Lane Highway) నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కు మోతాదులో 30 రెట్లకు సమానం. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటును కూడా వినియోగించారు. ఇది దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి వాడిన సిమెంట్ కాంక్రీటు మోతాదు కంటే 6 రెట్లు ఎక్కువ.
Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW
— Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023
ప్రస్తుతం ఉన్న ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేపై ట్రాఫిక్ ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ను నిర్మించారు. ఈ హైవే నిర్మాణంలో భాగంగా ఎన్నో ఫ్లైఓవర్‌లు, సొరంగాలు, అండర్‌పాస్‌లు, గ్రేడ్ రోడ్లు వేయాల్సి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ వేపై జర్నీ చేసి ద్వారక నుంచి మనేసర్‌కు కేవలం 15 నిమిషాల్లో వెళ్లొచ్చు. మనేసర్ నుంచి ఢిల్లీలోని విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణ సమయం మునుపటి కంటే 20 నిమిషాలు తగ్గుతుంది. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియో ఒకటి విడుదల చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని షేర్ చేశారు. మీరు కూడా దాన్ని చూసేయండి!!