NEET UG Result Date : నీట్ యూజీ ఆన్సర్ కీ, రిజల్ట్.. రిలీజ్ ఎప్పుడంటే ?
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ "నీట్" (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) UG (అండర్ గ్రాడ్యుయేట్) ఎగ్జామ్ కు సంబంధించిన ఆన్సర్ కీ మే నెలాఖరులో రిలీజ్ (NEET UG Result Date) అయ్యే ఛాన్స్ ఉంది.
- Author : Pasha
Date : 12-05-2023 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ “నీట్” (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) UG (అండర్ గ్రాడ్యుయేట్) ఎగ్జామ్ కు సంబంధించిన ఆన్సర్ కీ మే నెలాఖరులో రిలీజ్ (NEET UG Result Date) అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నీట్ ఎగ్జామ్స్ గత ట్రెండ్‌ను మనం పరిశీలిస్తే.. NEET UG పరీక్ష నిర్వహించిన దాదాపు 1.5 నెలల తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రిజల్ట్స్ ను విడుదల చేస్తోంది. ఈ లెక్కన జూన్ నెల చివరిలో నీట్ యూజీ ఫలితాలు (NEET UG Result Date) వచ్చే ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ డేట్ కు కొన్ని రోజుల ముందు ఆన్సర్ కీ విడుదల అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో అభ్యర్థులకు ఆన్సర్ కీ అందుబాటులోకి వస్తుంది.
also read : NEET: నీట్ వ్యతిరేక బిల్లు: రచ్చ లేపిన గవర్నర్ నిర్ణయం.. తగ్గేదేలే అంటున్న స్టాలిన్
అయితే, ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను తెలుసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్‌సైట్‌ను చూస్తుండాలి. MBBS, BDS, BSc నర్సింగ్, ఆయుష్ కోర్సులలో ప్రవేశం కోసం NEET UG పరీక్షను మే 7న నిర్వహించారు. ఈ ఏడాది 20 లక్షల మంది అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో మహిళా అభ్యర్థుల సంఖ్య 12 లక్షలకు పైగా ఉంది. ఈ సంఖ్య గతేడాది కంటే ఎక్కువ. NEET UG జవాబు కీని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు NTA NEET అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ని సందర్శించాలి.