Prashant Kishor : ‘‘నేను డబ్బులు అలా సంపాదించాను’’.. ప్రశాంత్ కిశోర్ వివరణ
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేని జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులకు అయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం’’ అని పీకే(Prashant Kishor) వివరించారు.
- By Pasha Published Date - 07:45 PM, Wed - 12 February 25

Prashant Kishor : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం బిహార్‌లో ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. దాని పేరు.. ‘జన్ సురాజ్’ పార్టీ. దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి అందుతోంది ? నిధులు ఇస్తున్నది ఎవరు ? అని జేడీయూ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ప్రశ్నించారు. ‘‘బెంగళూరులోని ఒక స్వచ్ఛంద సంస్థ జన్ సురాజ్ పార్టీకి నిధులిస్తోంది. కిషోర్ సైతం ఆ సంస్థకు రూ.50 లక్షలు డొనేట్ చేశారు. ఇవి పన్నుల ఎగవేత అవకతవకల్లా (టాక్స్ ఫ్రాడ్) కనిపిస్తున్నాయి’’ అని ఆయన ఆరోపించారు.దీనికి మీడియా సాక్షిగా ప్రశాంత్ కిశోర్ సమాధానమిచ్చారు. ఆ వివరాలను చూద్దాం..
Also Read :Worlds Corrupt Countries: అవినీతిమయ దేశాల లిస్ట్.. భారత్ ఎక్కడ ? నంబర్ 1 ఏ దేశం ?
పీకే ఏం చెప్పారు ?
‘‘తెలివితేటలే నా ఆర్థిక మార్గం. తెలివితేటలతోనే నేను డబ్బులు సంపాదించాను. ఎవరినైతే సరస్వతీ దేవి అనుగ్రహిస్తుందో వారు తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు” అని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. ‘‘నేను ఐఏఎస్ ఆధికారినో, ఐపీఎస్ అధికారినో కాదు. ప్రభుత్వ సర్వీసులో లేను. కాంట్రాక్టర్‌నో, ఎంపీనో, ఎమ్మెల్యేనో కాదు. నేను సంపాదించింది అంతా నా బుద్ధిని (తెలివితేటలు) ఉపయోగించుకుని సంపాదించిందే. నాలాగే బిహార్ యువతకు డబ్బు అనేది పెద్ద సమస్యేమీ కాదు. బిహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేని జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులకు అయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం’’ అని పీకే(Prashant Kishor) వివరించారు.
Also Read :China Vs US : గాజా స్వాధీనంపై అమెరికాకు చైనా సవాల్.. పాలస్తీనీయులకు జై
ప్రశాంత్ కిశోర్ ఎవరు ?
- ప్రశాంత్ కిషోర్ 2012లో రాజకీయ వ్యూహకర్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు.
- ఆ సమయంలో నరేంద్ర మోడీ తరఫున గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వ్యూహకర్తగా పీకే సేవలు అందించారు. అప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
- మోడీ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా పీకే కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మోడీ ప్రధానమంత్రి అయ్యారు.