HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Minister Jaishankars Visit To London Causes Chaos

London Tour : మంత్రి జైశంకర్‌ లండన్‌ పర్యటనలో అలజడి..!

ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్‌ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడినుంచి తరిమికొట్టారు.

  • By Latha Suma Published Date - 11:05 AM, Thu - 6 March 25
  • daily-hunt
Minister Jaishankar's visit to London causes chaos..!
Minister Jaishankar's visit to London causes chaos..!

London Tour : భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ లండన్‌ పర్యటనలో అలజడి చోటుచేసుకుంది. ఆయన కారు వద్దకు ఓ ఖలిస్థానీ మద్దతుదారు దూసుకొచ్చాడు. భారతీయ జెండాను చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. ఖలీస్తానీ ఉగ్రవాదితో పాటు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్‌లోని ఛాఠమ్‌ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జైశంకర్‌ బయటకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

Khalistani elements attempt to heckle India's External Affairs Minister S Jaishankar while he was leaving in a car after attending an event in London, England.

The National flag of India was desecrated.

The Govt of India must revoke the PIO/OCI cards of anti-India elements. pic.twitter.com/ogNjVkIpB6

— Anshul Saxena (@AskAnshul) March 6, 2025

Read Also: PM Modi : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని శుభాకాంక్షలు

మంత్రి జైశంకర్‌ లండన్‌లోని ఛాఠమ్‌ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్‌ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడినుంచి తరిమికొట్టారు. ఈ ఘటనతో జైశంకర్ సైతం.. ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. జైశంకర్ పర్యటనలో జరిగిన ఈ ఘటన భారత విదేశాంగ మంత్రికి చేదు అనుభవం కలిగించింది. ఖలిస్థానీ మద్దతుదారులు జైశంకర్ పర్యటనకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు.

కాగా,మంత్రి జైశంకర్‌ మంగళవారం (మార్చి 4) యూకే పర్యటనకు వెళ్లారు. ఈనెల 9వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బ్రిటన్‌ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వివిధ అంశాలపై ఇరువు చర్చించారు. అనంతరం ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. ఇక యూకే పర్యటన తర్వాత జైశంకర్ ఐర్లాండ్‌కు వెళ్లనున్నారు.

Read Also: Hijab Song: హిజాబ్‌పై సాంగ్.. సింగర్‌కు 74 కొరడా దెబ్బలు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chatham House
  • indian flag
  • Indian Foreign Minister Jaishankar
  • khalistani extremist
  • London Tour

Related News

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd