McDonald Menu- Tomatoes Dropped : బర్గర్ నుంచి టమాటా మాయం.. మీ ఫేవరెట్ రెస్టారెంట్ కీలక నిర్ణయం
McDonald Menu- Tomatoes Dropped : టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి..దీంతో చాలామంది వంటల్లో టమాటాను వాడటం మానేశారు.. ఈ లిస్టులో ఇప్పుడు ఫేమస్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ కూడా చేరిపోయింది..
- By Pasha Published Date - 02:44 PM, Fri - 7 July 23

McDonald Menu- Tomatoes Dropped : టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి..
దీంతో చాలామంది వంటల్లో టమాటాను వాడటం మానేశారు..
ఈ లిస్టులో ఇప్పుడు ఫేమస్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ కూడా చేరిపోయింది..
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మెక్‌డొనాల్డ్స్ అవుట్ లెట్లలో మెనూ నుంచి టమాటా డిషెస్ ను తొలగించారు..
క్వాలిటీ టమాటా లభ్యత లేనందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మెక్‌డొనాల్డ్స్ వెల్లడించింది.
వాస్తవానికి ఈ నిర్ణయానికి టమాటా ధరల పెరుగుదలే ప్రధాన కారణమని అంటున్నారు.
ఇప్పటికే ఉత్తర భారత దేశంలో టమాటా ధరలు కిలోకు రూ.150 దాటాయి.
“ఆహార నాణ్యత, భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్న బ్రాండ్‌గా, మేం నాణ్యమైన పదార్థాలను మాత్రమే వంటకాల్లో ఉపయోగిస్తాము. అయితే సీజనల్ సమస్యల కారణంగా మేం నాణ్యమైన టొమాటోలను సేకరించలేకపోతున్నాము. అందువల్ల మా రెస్టారెంట్లు కొన్నింటిలో మెనూ నుంచి టొమాటో డిషెస్ ను తొలగించాం(McDonald Menu- Tomatoes Dropped).. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే.. మేం త్వరలోనే మా మెనూలో టొమాటోని తిరిగి తీసుకొస్తాం” అని మెక్‌డొనాల్డ్స్ ఇండియా నార్త్ అండ్ ఈస్ట్ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
Also read : Sea Lions: చిలీలో 13,000 కంటే ఎక్కువ సముద్ర సింహాలు మృతి.. కారణమిదే..?
టమాటా రేట్లు ఎప్పుడు తగ్గుతాయి ?
దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు రుతుపవనాలు ఆలస్యం కావడం, సరిపడా టమాటాలు పండకపోవడం!! ఎండలు బాగా కాయడం.. విపరీతమైన వేడి వల్ల ఈసారి టమాటా సాగు తగ్గిపోయింది. ఇంకొన్ని రోజుల్లో ముంబైలో కిలో టమాటా రూ.200కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. మన హైదరాబాద్ లో కూడా టమాటా రేట్లు బాగా పెరిగాయి. ఇంకా పెరుగుతాయని అంటున్నారు. ఇక మరెప్పుడు టమాటా రేట్లు తగ్గేది ? అంటే.. రుతుపవనాల ప్రారంభంతో వాతావరణం చల్లబడింది. దీంతో ఖరీఫ్ సీజన్ టమాటాలు ఇప్పుడిప్పుడే కోతకు వస్తున్నాయి. ఆగస్టు మూడోవారంకల్లా ఖరీఫ్ టమాటాలు మార్కెట్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటివరకు టమాటాల ధరలు పెరుగుతూ పోయే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన టమాటా రేట్లు తగ్గేది ఆగస్టు చివరి వారంలోనే !!