Manish Sisodio: తీహార్ జైలుకు మనీష్ సిసోడియో!
మార్చి 20వ తేదీ వరకూ సిసోడియాకు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు.
- By Balu J Published Date - 03:22 PM, Mon - 6 March 23

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor policy Scam) కేసు తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ (Judicial Custody) విధించింది. మార్చి 20 వరకూ ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే సిసోడియా బెయిల్ అభ్యర్థనపై మార్చి 10న విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.
దీనికి ముందు, గత శనివారంనాడు సిసోడియా కస్టడీని మార్చి 6వ తేదీ వరకూ కోర్టు పొడిగించింది. ఆ గడువు ముగుస్తుండంటంతో సోమవారంనాడు ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. మార్చి 20వ తేదీ వరకూ సిసోడియాకు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. కాగా, తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తొలుత హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ మార్చి 10న చేపడతామని కోర్టు తెలిపింది.