Gold Wires: ఇనుప కడ్డీలు కావు.. స్వచ్ఛమైన బంగారం!!
అరబ్ దేశాల నుంచి ఇండియాకు బంగారం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక వ్యక్తి బంగారాన్ని రంగు మార్పించి.
- By Hashtag U Published Date - 02:30 PM, Sun - 17 July 22
అరబ్ దేశాల నుంచి ఇండియాకు బంగారం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక వ్యక్తి బంగారాన్ని రంగు మార్పించి.. ఇనుప కడ్డీల మాదిరిగా తయారు చేయించి తీసుకొచ్చాడు. రాజస్థాన్ లోని జైపూర్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఒక వ్యక్తి లగేజీ బ్యాగ్ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. 2170.3 గ్రాముల బరువు ఉన్న ఈ బంగారు కడ్డీల విలువ దాదాపు రూ.కోటికి పైనే ఉంటుంది. ఈ బంగారం ఫ్యూరిటీ 99.50 ఉందని కస్టమ్స్ అధికారులు తేల్చారు. షార్జా నుంచి జైపూర్ కు ఎయిర్ అరేబియా విమానంలో వచ్చిన ప్రయాణికుడి నుంచి వీటిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. 1962 కస్టమ్స్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
మలద్వారం నుంచి మూడు క్యాప్సుల్స్..
జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కస్టమ్స్ అధికారులు మరో ప్రయాణికుడి వద్ద సుమారు 769.5 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 41 లక్షలు. ఓ ప్రయాణికున్నీ కస్టమ్స్ అధికారులు ఎన్ని ప్రశ్నలు అడిగినా అతనేమీ చెప్పలేదు. దీంతో అతన్ని సోదా చేశారు. కానీ సీటీ స్కాన్
తర్వాత ఆ ప్రయాణికుడి మలద్వారం నుంచి మూడు బంగారు క్యాప్సుల్స్‌ను రికవర్ చేశారు. వీటిలో పసుపు రంగు గుళికలు ఉన్నాయి. పాలీథీన్ టేపుతో వాటిని చుట్టి ఉంచారు.
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.