Lookback 2024 National Politics : బిజెపి అదే దూకుడు..కాంగ్రెస్ అదే వెనుకడుగు
Lookback 2024 National Politics : 2024 భారత జాతీయ రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించే అంశాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా, జనాభా అత్యధికంగా ఉన్న భారతదేశంలో ఈ సంవత్సరంలో ప్రధాన పార్టీల మధ్య పోటీని చూడవచ్చు
- By Sudheer Published Date - 12:39 PM, Fri - 13 December 24

Lookback 2024 National Politics : మరో రెండు వారాల్లో కొత్త ఏడాది (2025)లోకి అడుగుపెట్టబోతున్నాం. దీంతో అంత ఈ ఏడాది (2024) లో ఏంజరిగింది..? ఎలాంటి మార్పులు జరిగాయి..? రాజకీయ పార్టీల దూకుడు ఎలా ఉంది..? ప్రజలు ఏం కోరుకున్నారు..? నేతలు ఏంచేశారు..? ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీలను గెలిపించారు..? విజయం వెనుక పార్టీల రహస్యాలు ఏంటి…? ఇలా ఎన్నో రకాలుగా రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఏడాది లో రాజకీయా పార్టీల పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం.
2024 భారత జాతీయ రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించే అంశాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా, జనాభా అత్యధికంగా ఉన్న భారతదేశంలో ఈ సంవత్సరంలో ప్రధాన పార్టీల మధ్య పోటీని చూడవచ్చు. బిజెపి, కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు (BJP Vs Congress) తమ విజయాల కోసం పలు వ్యూహాలను అమలు చేసారు. ముఖ్యంగా బిజెపికి ఈ ఏడాది కూడా బాగా కలిసొచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. “ఇండియా” కూటమి ఆధ్వర్యంలో బీజేపీని కట్టడి చేయడానికి ట్రై చేసినప్పటికీ ప్రజలు మాత్రం బీజేపీకే పట్టం కట్టారు. బీజేపీని గద్దె దించలేకపోయినా, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష స్థాయిని చేరుకుంది. 2014 నుండి బీజేపీ అనూహ్య విజయాలు సాధిస్తూ, రెండు సార్లు పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కశ్మీర్, అయోధ్య వంటి సమస్యలను పరిష్కరించి, బీజేపీ అనేక రాజకీయ విజయాలను సాధించింది. ఈసారి కూడా నాలుగు వందల సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, బీజేపీ పూర్తి మెజార్టీ సాధించలేకపోయింది. అయితే, ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన టీడీపీ, జేడీయూ వంటి పార్టీలు బీజేపీకి సహకరించడంతో, ఈ ఏడాది కూడా బీజేపీ హవా కొనసాగింది. తెలుగుదేశం, జేడీయూ వంటి ప్రాంతీయ పార్టీల పాత్ర పెరిగింది. చంద్రబాబు, నితీష్ వంటి నాయకుల మీద ఆధారపడి, రాష్ట్రంలో మంచి విజయాలు సాధించిన ఈ పార్టీలకు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. దేశ రాజకీయం లో ఈ ప్రాంతీయ పార్టీల వైభవం పెరిగింది.
ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కష్టకాలంలో పడుతూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించినప్పటికీ, రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన పైస్థాయిని నిలుపుకోలేకపోయింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. కాంగ్రెస్ కు ఏ ఏడాది కలిసొచ్చింది అంటే అది తెలంగాణ , మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించడమే. మొత్తానికి మాత్రం ఈ ఏడాది బిజెపికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.
Read Also : YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..