CM Candidate : సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు
ఎంవీఏ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ థాక్రే (CM Candidate) మాట్లాడారు.
- By Pasha Published Date - 05:33 PM, Sun - 13 October 24

CM Candidate : అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ మహారాష్ట్ర రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్‌సీపీ(శరద్ పవార్)లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరు ? బీజేపీ, ఎన్‌సీపీ, శివసేనలతో కూడిన ‘మహాయుతి’ కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరు ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో శివసేన(ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే కీలక కామెంట్స్ చేశారు.
Also Read :ShakthiSAT : 108 దేశాల బాలికలతో చంద్రయాన్-4 శాటిలైట్.. ‘శక్తిశాట్’కు సన్నాహాలు
తమ కూటమి సీఎం అభ్యర్థి గురించి ప్రశ్నించే హక్కు మహాయుతి కూటమికి లేదని ఆయన మండిపడ్డారు. మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే.. తమ కూటమి (ఎంవీఏ) సీఎం అభ్యర్థిపై ప్రకటన చేస్తామని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవాళ్లే సీఎం అభ్యర్థిపై తొలుత క్లారిటీ ఇవ్వాలన్నారు. మహాయుతి కూటమి ద్రోహుల నాయకత్వంలో ప్రజల్లోకి వెళ్తోందని.. వారికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. ఎంవీఏ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ థాక్రే (CM Candidate) మాట్లాడారు.
Also Read :Mallikarjun Kharge : ‘ముడా’ ఎఫెక్ట్.. కర్ణాటక సర్కారుకు భూమిని తిరిగి ఇచ్చేయనున్న ఖర్గే
‘‘సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అరెస్టయిన వారు నిందితులో కాదో తెలియడం లేదు. నేరస్థులను మహాయుతి సర్కారు చూసీ చూడనట్లు వదిలేస్తోంది’’ అని ఉద్ధవ్ థాక్రే ధ్వజమెత్తారు. ‘‘గత లోక్‌సభ ఎన్నికల తరహా ఫలితాలనే ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలి’’ అని ఓటర్లను శరద్ పవార్ కోరారు. బంజారా వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఇటీవల ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బంజారా వర్గానికి చెందిన వసంతరావ్ నాయక్ మహారాష్ట్రకు అత్యధిక కాలం సీఎంగా పనిచేశారన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలన్నారు.