బాణాసంచా నిషేధంపై `జగ్గీ` ఆఫీస్ వాక్ అస్త్రం
దీపావళి సందర్భంగా బాణాసంచా పేల్చడంపై నెలకొన్ని వివాదంలోకి ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీవాసు దేవన్ వచ్చేశాడు
- By Hashtag U Published Date - 01:53 PM, Wed - 3 November 21

దీపావళి సందర్భంగా బాణాసంచా పేల్చడంపై నెలకొన్ని వివాదంలోకి ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీవాసు దేవన్ వచ్చేశాడు. పిల్లల సంతోషాన్ని కాదనడానికి లేదని, బాణా సంచా పేల్చడానికి మద్ధతు ప్రకటింంచాడు. అంతేకాదు, చిన్ననాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నాడు. సెప్టెంబర్ నెల నుంచే దీపావళి పండుగ గురించి ఆలోచించే వాడినని వివరించాడు. దీపావళి బాణాసంచాను పండుగ అయిపోయిన తరువాత కూడా రెండు నెలల పాటు ప్రతి రోజూ కాల్చుతుండే వాడినని చెప్పాడు. ఆయన చిన్ననాటి పండుగ సంతోషాన్ని గుర్తు చేస్తూ, బాణాసంచా పేల్చడాన్ని అడ్డుకోవడం పిల్లల హాపీ మూడ్ ను అడ్డుకోవటమేనని జగ్గీ అభిప్రాయపడ్డారు.
Concern about air pollution is not a reason to prevent kids from experiencing the joy of firecrackers. As your sacrifice for them, walk to your office for 3 days. Let them have the fun of bursting crackers. -Sg #Diwali #DontBanCrackers pic.twitter.com/isrSZCQAec
— Sadhguru (@SadhguruJV) November 3, 2021
పిల్లలు కాల్చే బాణాసంచా కారణంగా వాతావరణం కాలుష్యం అవుతుందని పెద్దలు భావిస్తున్నారు. కానీ, పిల్లల సంతోషం కోసం మూడు రోజుల పాటు ఆఫీస్ లకు నడచి వెళ్లాలని జగ్గీ ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించాడు. ప్రతి రోజూ ఆఫీస్ లకు కార్లు, ద్విచక్ర వాహనాలతో వెళుతుంటారు. ఫలితంగా వాయు కాలుష్యం పెరిగిపోయింది. దానికి అదనంగా బాణ సంచా పేలుళ్లు కూడా తోడైతే కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుర సూచించింది. అందుకే, మూడు రోజుల పాటు ఆఫీస్ లకు వాహనాలతో కాకుండా నడిచి వెళితే, పిల్లలు దీపావళి వెలుగులను ఆస్వాదించడానికి అవకాశం ఉంటుందని జగ్గీ ఇచ్చిన ప్రత్యామ్నాయ ఆలోచన.
దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడంపై భిన్న స్వరాలను దేశ ప్రజలు వినిపిస్తున్నారు. కాలుష్యం అదుపులో ఉండాలంటే, బాణాసంచా వద్దని కొందరు వాదిస్తున్నారు. ఆ మేరకు కోల్ కతా హైకోర్టుకు కాలుష్య నివారణ కోరుకునే వాళ్లు వెళ్లారు. వాళ్ల పిటిషన్ మీద వాదప్రతివాదనలు విన్న తరువాత బాణాసంచా పేల్చడానికి లేదని తీర్పు చెప్పింది. దాన్ని సవాల్ చేస్తూ బాణాసంచా డీలర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద వాదప్రతిపాదనలను విన్న తరువాత గ్రీన్ బాణాసంచాను కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి పేల్చుకోవచ్చని ఉత్తుర్వులు ఇచ్చింది.
Also Read : మోడీ దీపావళి ధరలపై రాహుల్ ఫైర్
ఢిల్లీలో కాలుష్యం ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరింది. వాయి కాలుష్య స్థాయి ప్రస్తుతం మొత్తం మీద 303 ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ఫైరదాబాద్ 306, గజియాబాద్ 334, నోయిడా 303 కాలుష్యం నమోదు అయింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఢిల్లీలో 298 గా వాతావరణ కాలుష్యం ఉంది. ఇలాంటి పరిస్థితిల్లో బాణాసంచా కాల్చడం మంచిది కాదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెబుతోంది. కానీ, జగ్గీ వాసుదేవన్ మాత్రం మూడు రోజులు పాటు వాహనాలు వాడకుండా నడుచుకుంటూ ఆఫీస్ లకు వెళితే, కాలుష్యం నియంత్రణలో ఉంటుందని సూచిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జగ్గీ వాసుదేవన్ చెబుతున్న వాదనల్లో దేనికి ప్రజలు మద్ధతు ఇస్తారో..చూద్దాం.!
Also Read : నోట్లో నుంచి బయటికొచ్చిన సాలీడు.. వైరల్ అవుతున్న వీడియో
Related News

Vijay Rashmika : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలెబ్రేషన్స్? మరోసారి దొరికేశారు..
దీపావళి సందర్భంగా విజయ్ దివాళీ(Diwali) సెలెబ్రేషన్ కి సంబంధించి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక రష్మిక కూడా ఒక ఫొటో షేర్ చేసి దీపావళి విషెష్ చెప్పింది.