Last moments of CDS : నింగిలో దూసుకుపోతూ.. నిమిషాల్లో నేలకూలుతూ!
తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం భారత వైమానిక దళానికి చెందిన Mi-17V5 హెలికాప్టర్ కూలిపోవడంతో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికతో పాటు 11 మంది సాయుధ దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
- By Balu J Published Date - 12:30 PM, Thu - 9 December 21

తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం భారత వైమానిక దళానికి చెందిన Mi-17V5 హెలికాప్టర్ కూలిపోవడంతో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికతో పాటు 11 మంది సాయుధ దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి మొదటగా చేరుకున్న స్థానికులు విషాద ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ‘‘మొదట పెద్ద శబ్ధం వినిపించింది.. ఏం జరిగిందో చూసేందుకు బయటికి వచ్చేసరికి హెలికాప్టర్ చెట్టును ఢీకొట్టింది. అక్కడ భారీ అగ్నిగోళం వచ్చి మరో చెట్టును ఢీకొట్టింది. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కనిపించారు. హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చేసరికి పూర్తిగా కాలిపోయి కిందపడి ఉన్నారు.
#WATCH | Final moments of Mi-17 chopper carrying CDS Bipin Rawat and 13 others before it crashed near Coonoor, Tamil Nadu yesterday
(Video Source: Locals present near accident spot) pic.twitter.com/jzdf0lGU5L
— ANI (@ANI) December 9, 2021
తమిళనాడులోని కూనూర్ సమీపంలో కూలిపోయే ముందు Mi-17 చాపర్ చివరి క్షణాలను చూపించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. స్థానికులు చిత్రీకరించిన వీడియోలో హెలికాప్టర్ ఎగురుతూ, ఆపై సెకన్లలో కూలిపోవడం చూడొచ్చు. అంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ క్రాష్ సైట్ నుంచి అనేక విజువల్స్ భారీ మంటలను చూపించాయి. స్థానికులు తక్షణ సహాయక చర్యలకు సహాయం చేశారు. తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం మధ్యాహ్నం భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కూలిపోవడంతో 13 మంది మరణించారు.
ప్రమాదంలో చనిపోయినవాళ్లు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) బిపిన్ రావత్, మధులికా రావత్ (CDS బిపిన్ రావత్ భార్య), బ్రిగ్ LS లిడర్, లెఫ్టినెంట్ కల్నల్ H సింగ్, Wg Cdr PS చౌహాన్, Sqn Ldr K సింగ్, JWO దాస్ , JWO ప్రదీప్ A, హవ్ సత్పాల్, Nk గుర్సేవక్ సింగ్, Nk జితేందర్, L/Nk వివేక్, L/Nk S తేజ.

Bipin Last Memory