HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Kashmiri Girl Request To Prime Minister Narendra

Viral Video: మోడీజీ నా స్కూల్ పరిస్థితి చూడండి: వైరల్ వీడియో

దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ అంటూ ఓ పసిపాప తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన స్కూల్ దుస్థితి వీడియోలో బంధించి మోడీకి విన్నవించుకుంది

  • Author : Vamsi Chowdary Korata Date : 14-04-2023 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viral Video
Viral Video

Viral Video: దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ అంటూ ఓ పసిపాప తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన స్కూల్ దుస్థితి వీడియోలో బంధించి మోడీకి విన్నవించుకుంది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… క్షణాల్లో వైరల్ గా మారింది. కొద్దీ క్షణాల్లోనే మిలియన్ వ్యూస్ సాధించింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆ పాప మోడీని ఏమని అభ్యర్ధించి ఇప్పుడు చూద్దాం…

జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ స్థానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. అయితే ఆ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఫ్లోరింగ్ అంత మురికిగా కనిపిస్తుంది. దీంతో విద్యార్థుల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తన పాఠశాల దుస్థితిని ఎలాగైనా ప్రధానికి తెలియచెప్పాలని నిశ్చయించుకుంది. మొబైల్ లో వీడియో ఆన్ చేసి… డియర్ మోడీజీ.. మా స్కూల్ ఎంత చెత్తగా ఉందో చూడండి. చాలా మురికిగా ఉంది. దానిమీదనే మేము కూర్చుంటున్నాము. మా స్కూల్ డ్రెస్ కి మురికి అంటడంతో మా పేరెంట్స్ మమ్మల్ని తిడుతున్నారు. మీరు దేశంలోని అందరి మాట వింటారు కదా. నా మాట కూడా వినాలని ఆ పసిపాప మోడీజీని అభ్యర్ధించింది.

డియర్ మోడీజీ మిమ్మల్ని ఒకసారి మా పాఠశాలకు టూర్ కి తీసుకొస్తాను. మా పాఠశాల ఎంత మట్టితో నిండి ఉందో మీరే చూస్తారు. మా స్కూల్ భవనం గత ఐదేళ్లుగా ఇలానే ఉంది. మీరు మా స్కూల్ ని పట్టించుకుని బాగు చేయాలి. ప్రిన్సిపాల్ రూమ్, స్టాఫ్ రూమ్ కూడా ఇలానే మురికిగా ఉంది. కావాలంటే మీరే చూడండి అంటూ కెమెరాని అటువైపుగా చూపించింది. మీరు ఇక్కడే కొత్త స్కూల్ భవనం నిర్మించాలి అంటూ ఖాళీ ప్రదేశాన్ని చూపించింది ఆ చిన్నారి. మీరు మా పాఠశాలను అందంగా తీర్చి దిద్దితే మేము అందరం బాగా చదువుకుంటాము. దయచేసి మా స్కూల్ ని బాగు చేయండి మోడీజీ అంటూ వీడియో సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వందల మంది కామెంట్స్ చేస్తున్నారు. లక్షల లైక్ లు, మిలియన్ వ్యూస్ తో వైరల్ గా మారింది.

Read More: PM Modi Meditation Cave: మోడీ ధ్యానం చేసిన గుహకు క్రేజ్.. మే వరకు అడ్వాన్స్ బుకింగ్స్.. రెంట్ సహా పూర్తి వివరాలివి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pm modi
  • school
  • Student
  • viral video

Related News

Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, భారతదేశంతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులు అధిక జీతాలు మరియు గొప్ప సామాజిక గౌరవాన్ని పొందుతున్నారని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, ఆ దేశంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులకు లభించే విలువ

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd