Kalpana Soren : నామినేషన్ వేసిన మాజీ సీఎం భార్య.. బైపోల్లో గెలిస్తే సీఎం పోస్టు ?
Kalpana Soren : జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు.
- By Pasha Published Date - 03:22 PM, Mon - 29 April 24
Kalpana Soren : జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఆమె ఉప ఎన్నిక జరగనున్న గాండే అసెంబ్లీ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కల్పన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ముఖ్యమంత్రి చంపై సోరెన్, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. ఈ స్థానంలో మే 20న ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిలీప్ వర్మ పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు కల్పన తన అత్తామామల ఆశీర్వాదాలు తీసుకున్నారు.దానికి సంబంధించిన ఓ ఫొటోను ఆమె(Kalpana Soren) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుతం మాజీ సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గాండే అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో గెలిచాక కల్పనా సోరెన్ సీఎం అవుతారని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్న కల్పనా సోరెన్.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను మోడీ సర్కారు వేధిస్తోందని.. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆమె ఆరోపించారు. కాగా, గాండేలో జేఎంఎం ఎమ్మెల్యేగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ గతేడాది డిసెంబర్ 31న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచే కల్పన అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Also Read :CM Revanth : రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్‌కే ఓటు వేయండి : సీఎం రేవంత్
Related News
Tadipatri : తాడిపత్రిలో 144 సెక్షన్.. రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బుధవారం ఉదయం కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.