Ecil Jobs: రాతపరీక్ష లేకుండానే హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు, ఆ రెండు రోజుల్లోనే ఇంటర్వ్యూలు
- By hashtagu Published Date - 10:22 AM, Tue - 4 April 23
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Ecil)పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ లోని సంస్థలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఈసీఐఎల్ ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయో నోటిఫికేషన్లో పూర్తిగా వివరించింది.
ఖాళీలు, అర్హతలు
నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. వీటిలో టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఈసీఈ, ఈటీసీ, ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ, ఐటీ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఎంపీసీ, డిప్లొమాచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ఇక అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలేకుండా డైరెక్టుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. సీఎల్డీఎస్, నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్, హైదరాబాద్, 500062 అడ్రస్‌లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఇందులో ఎంపికైతే టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 25వేలు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ. 24,500చెల్లిస్తారు. ఏప్రిల్ 6,7తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్య్వూలు నిర్వహిస్తారు.
Related News
BSF Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు..!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదో చక్కటి అవకాశం.