Rahul Gandhi: రాహుల్ జోడో యాత్రపై జైన్ ముని వీడియో వైరల్
జైన సన్యాసి రామ్నిక్ ముని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ తన 4000 కిలోమీటర్ల 'భారత్ జోడో యాత్ర'ను ఉద్దేశించి మాట్లాడారు.
- By Praveen Aluthuru Published Date - 01:47 PM, Sun - 16 July 23

Rahul Gandhi: జైన సన్యాసి రామ్నిక్ ముని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ తన 4000 కిలోమీటర్ల ‘భారత్ జోడో యాత్ర’ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ తెలివైన వాడిగా అభివర్ణించాడు. రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్లు నడిచిన విధానం చూసి ఆయనపై నా అభిప్రాయం మారిపోయిందని తెలిపారు. అంతకుముందు రాహుల్ సామాన్యుల పట్ల సీరియస్‌గా ఉండరని, వారి బాధను అర్థం చేసుకోరని నేను భావించేవాడినని, అయితే ఇప్పుడు రాహుల్ ఆంటే ఏంటో నాకు అర్ధం అయిందని చెప్పాడు రామ్నిక్ ముని. రాహుల్ భారతదేశాన్ని మారుస్తాడు. రాహుల్ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతుందని , అయితే సూర్యుడిని, సత్యాన్ని ఎవరు దాచగలిగారు అంటూ తన భావాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ సమయంలో జైన్ ముని రాహుల్ జోడోయాత్ర, ఆయన వ్యక్తిత్వంపై తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా వ్యక్తపరచడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"राहुल गांधी जी की तपस्या और विचारधारा देखकर मेरे विचार बदल गए। क्या स्तिथप्रज्ञ आदमी है! ये भारत को बदल कर रख देगा।"
– रमणीक मुनि जी महाराज@RahulGandhi नहीं बदले हैं – वो हमेशा से ऐसे ही थे – करोड़ों रुपये खर्च करके उनकी छवि को बिगाड़ने की साज़िश अब ध्वस्त हो गई.
आख़िर… pic.twitter.com/FR6itmC6Sb
— Supriya Shrinate (@SupriyaShrinate) July 16, 2023