IT Raids : ఉదయ్‌పూర్‌లో ఐటీ దాడులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలో సోదాలు
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి సహచరులకు
- By Prasad Published Date - 01:07 PM, Mon - 9 October 23

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి సహచరులకు సంబంధించిన స్థలాలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడిలో రూ.70 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులు బయటపడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లు, ఇతర స్థలాల నుంచి ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను సేకరించారు. దీంతో పాటు మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన కార్యాలయాలు, ఇళ్లు, వాటి సహచరుల నుంచి దాదాపు రూ.70 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు మాత్రం వివరాలు వెల్లడించలేదు. 40 ఐటీ శాఖ అధికారుల బృందాలు, 100 మందికి పైగా పోలీసు సిబ్బంది గత నాలుగు రోజులుగా ఈ సోదాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ బృందాలు బిల్డర్లు, ఇతర వ్యాపారవేత్తలకు సంబంధించిన 40 కంటే ఎక్కువ ప్రదేశాలలో సోదాలు నిర్వహించాయి. నాలుగో రోజు దాదాపు 17 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు తెరిచారు. ఇందులో రూ.70 కోట్ల విలువైన బినామీ ఆస్తులను గుర్తించారు. ఇందులో ఆరు కేజీల బంగారం, 90 కేజీల వెండి, రూ.2.5 కోట్ల నగదు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read: CM Jagan To Start Bus Yatra In AP : రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర..