ISRO Gaganyaan: గగన్‌యాన్ వ్యోమగాముల రక్షణకు “ఎస్కేప్ మోటార్”!!
ఇస్రో మరో ముందడుగు వేసింది. మానవ సహిత అంతరిక్ష యాత్ర "గగన్‌యాన్ మిషన్"లో కీలక పురోగతి సాధించింది.
- By Hashtag U Published Date - 06:00 PM, Thu - 11 August 22

ఇస్రో మరో ముందడుగు వేసింది. మానవ సహిత అంతరిక్ష యాత్ర “గగన్‌యాన్ మిషన్”లో కీలక పురోగతి సాధించింది. ఏదైనా అనుకోని విపత్తు తలెత్తినప్పుడు వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు సంబంధించిన ‘లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్’ (ఎల్‌ఈఎం) పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న స్పేస్‌పోర్టు నుంచి దీన్ని పరీక్షించారు. వ్యోమగాములతో నింగి వైపు దూసుకెల్లే రాకెట్ ఒకవేళ మార్గం మధ్యలో విఫలమైతే.. అనుకోని ప్రమాదం జరిగితే ‘లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్’ స్పందిస్తుంది. పని చేస్తుంది. రాకెట్ లో వ్యోమగాముల టీమ్ ఉన్న భాగాన్ని సురక్షితంగా బయటకు నెట్టేస్తుంది. ఫలితంగా మానవ సహిత గగన్ యాన్ మిషన్ లల్లో ప్రాణ నష్టం జరగకుండా నివారించే వీలు కలుగుతుంది.
2022 చివరికల్లా..
ఇస్రో గగన్ యాన్ పేరిట GSLV MK.3 ద్వారా 2022 చివరికల్లా ప్రయోగంను చేపట్టాలని నిర్ణయించింది.గగన్ యాన్ ప్రయోగం సక్సెస్ చేసే దిశగా ఇస్రో ముందస్తుగా భూస్థిర పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఐదు పరీక్షలు నిర్వహించి విజయవంతం చేశారు. మరికొన్ని భూస్థిర పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.గగన్ యాన్ ప్రయోగంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఇస్రో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగ సమయంలో ప్యారాచూట్లను ఉపయోగించ నున్నారు.
క్రాయోజనిక్ ఇంజన్ పరీక్షలు..
ఈ నేపథ్యంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు GSLV MK.3 గగన్ యాన్ ప్రయోగంలో ఉపయోగించే మూడవ దశలోని క్రాయోజనిక్ ఇంజన్‌కు సంబంధించిన పరీక్షలు తమిళనాడులోని ఇస్రో కు చెందిన ప్రొపెల్షాన్ సెంటర్ నందు గతంలో విజయవంతంగా నిర్వహించారు.