India – Pakistan War : మీకు ఆ భయం అవసరం లేదు – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
India - Pakistan War : దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదు అని స్పష్టం చేస్తూ, సరఫరా వ్యవస్థ పూర్తిగా సజావుగా సాగుతోందని తెలిపింది
- By Sudheer Published Date - 12:46 PM, Fri - 9 May 25

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దేశవ్యాప్తంగా ఇంధనంపై వాహనదారుల్లో భయం మొదలైంది. ఈ తరుణంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదు అని స్పష్టం చేస్తూ, సరఫరా వ్యవస్థ పూర్తిగా సజావుగా సాగుతోందని తెలిపింది. ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేదని, అన్ని పెట్రోల్ బంకులు, LPG అవుట్‌లెట్లు మామూలుగా పనిచేస్తున్నాయని తెలిపింది.
ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతూ, ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తగిన సమాచారంతో భయాన్ని నివారించేందుకు ఇండియన్ ఆయిల్ ఈ ప్రకటన విడుదల చేసింది.
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు
ఇంధన సంస్థ ప్రజలను ప్రశాంతంగా ఉండమని, అనవసర రద్దీ వల్ల సరఫరా వ్యవస్థకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నందున సహకరించమని విజ్ఞప్తి చేసింది. ఇంధనం నిరంతరాయంగా అందుబాటులో ఉంచేందుకు తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ప్రజల సహకారంతో దేశవ్యాప్తంగా సజావుగా సేవలు అందించాలని సంస్థ పేర్కొంది.