Manipur Violence : మణిపూర్‌లో అమానుషం.. కిడ్నాపైన ఇద్దరు విద్యార్థుల మర్డర్
Manipur Violence : మణిపూర్ లో అమానుష ఘటనలు ఆగడం లేదు.
- Author : Pasha
Date : 26-09-2023 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
Manipur Violence : మణిపూర్ లో అమానుష ఘటనలు ఆగడం లేదు. హింసాగ్ని చల్లారడం లేదు. జులైలో కిడ్నాపయిన ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మైతై తెగకు చెందిన ఇద్దరు పిల్లలు జులై నుంచి కనిపించడం లేదు. వారు కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. ఇద్దరు విద్యార్థులు అటవీ ప్రాంతంలోని ఓ క్యాంపులో కూర్చుని ఉండగా, వెనక సాయుధ దుండగులు నిలబడిన ఫొటో వైరల్ అవుతోంది. మరో ఫొటోలో ఇద్దరు విద్యార్థులు చనిపోయి పడి ఉన్నారు.
Also read : Pranitha Subhash : ఉల్లిపొర డ్రెస్ లో అందాలతో ఊరిస్తున్న ప్రణీత..
ఈ ఘటన మణిపూర్‌లో కలకలం రేపుతోంది. పరిస్థితి మళ్లీ అదుపుతప్పే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇద్దరు పిల్లల మర్డర్ కేసును సీబీఐకి అప్పగించారు. విద్యార్థులను హత్య చేసిన వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ వెల్లడించారు. మణిపూర్‌లో హింసాకాండ రగిలినప్పటి నుంచి ఇప్పటివరకు 108 మంది మృతిచెందినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు (Manipur Violence) చెబుతున్నాయి.