HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Iit Bombay Students Fined For Making Jokes With Ramayana Skit

Ramayana Skit : ‘రామాయణం’పై నాటకం.. ఐఐటీ బాంబే విద్యార్థులకు ఫైన్‌

రామాయణం.. యావత్ మానవాళికి జీవన మార్గదర్శకం.  దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు.

  • By Pasha Published Date - 12:42 PM, Thu - 20 June 24
  • daily-hunt
Ramayana Skit

Ramayana Skit : రామాయణం.. యావత్ మానవాళికి జీవన మార్గదర్శకం.  దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. జీవితాలను తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటి మహోన్నత రామాయణంపై ఐఐటీ బాంబేలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన ‘రాహోవన్‌’ నాటకం వివాదాస్పదమైంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులో ఐఐటీ బాంబే  వార్షిక ఆర్ట్స్‌ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించిన ‘రాహోవన్‌’ నాటకంలో పవిత్ర రామాయణాన్ని కించపర్చారనే ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నాటకంలో ఎక్కడా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను ప్రస్తావించలేదు. అయితే అరణ్యవాసంలోని ఘట్టాలతో పోలిన సన్నివేశాలను ప్రదర్శించారు. ఈ సన్నివేశాల్లో నటించిన విద్యార్థుల భాష, హావభావాలపై అంతటా అభ్యంతరం వ్యక్తమైంది. ఆ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారడంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. నాటిక ప్రదర్శించిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

We’re now on WhatsApp. Click to Join

‘రాహోవన్‌’ నాటకంలో(Ramayana Skit) నటించిన ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ఐఐటీ బాంబే యాజమాన్యం వెల్లడించింది. ఈ నాటకంలో నటించిన వారిలో గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు, జూనియర్లు ఉన్నారు. అయితే జరిమానా అనేది సీనియర్లకు ఒక్కొక్కరికీ రూ.1.2 లక్షలు చొప్పున విధించారు. వీరు జింఖానా అవార్డులు తీసుకునేందుకు అనర్హులని ఐఐటీ బాంబే మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ ఫైన్‌ వారి సెమిస్టర్‌ ఫీజుకు దాదాపు సమానం. ఇక, ఈ నాటకంలో నటించిన జూనియర్లకు దాదాపు రూ.40వేలు చొప్పున జరిమానా విధించారు. వీరు హాస్టల్‌ సదుపాయాలను పొందడంపైనా బ్యాన్ విధించారు.

Also Read : Leaked NEET Paper : లీకైన ‘నీట్’ పేపర్.. ఎగ్జామ్‌లో వచ్చిన పేపర్ ఒక్కటే : అభ్యర్థి వాంగ్మూలం

రాముడి గొప్పతనం.. 

  • రాముడు గుణవంతుడు. ధర్మం తెలిసినవాడు.
  • రాముడు తండ్రి మాటకు గౌరవం ఇచ్చి దానికి కట్టుబడి ఉండే ఉత్తముడు.
  • శివధనస్సు విరిచి సీతాదేవిని పరిణయమాడటం బట్టి వీరుడిగా, ధీరుడిగా వెలిగాడు.
  • సీతను రావణుడు అపహరించినప్పుడు సహనంతో, నేర్పుతో సీతను దక్కించుకున్నాడు.
  • తన తమ్ముళ్లపై అవ్యాజ్యమైన ప్రేమ ఉన్నవాడు రాముడు.
  • యుద్ధనీతి తెలిసినవాడు రాముడు. సీతను తనకు అప్పగించమని యుద్ధానికి ముందే రావణుడికి రాయబారం పంపిన దయార్ద్ర హృదయుడు రాముడు.
  • ప్రజలను కన్నబిడ్డలుగా భావించి రాముడు అయోధ్యను పరిపాలించాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IIT Bombay
  • IIT Bombay Students
  • Jokes On Ramayana
  • Raahovan
  • Ramayana Skit

Related News

    Latest News

    • ‎Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Moong Dal: వామ్మో.. ప్రతిరోజు పెసలు తింటే ఏకంగా అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?

    • ‎Fenugreek-Fennel Water: ఉదయాన్నే మెంతి,సోంపు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Vastu Shastra: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 5 రకాల పెయింటింగ్స్ ఉంటే చాలు.. అదృష్టం మారిపోవడం ఖాయం!

    • ‎Rain Water: ఇంట్లో కష్టాలు,ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నారా.. అయితే వర్షపు నీటితో ఇలా చేయాల్సిందే!

    Trending News

      • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

      • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

      • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

      • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

      • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd