Kargil Historic : కార్గిల్‌పై హిస్టారికల్ నైట్ ల్యాండింగ్.. ఫీట్ విశేషాలివీ..
Kargil Historic : కార్గిల్ పర్వతాలు పెద్ద చిక్కుముడిలా ఉంటాయి.
- Author : Pasha
Date : 07-01-2024 - 1:56 IST
Published By : Hashtagu Telugu Desk
Kargil Historic : కార్గిల్ పర్వతాలు పెద్ద చిక్కుముడిలా ఉంటాయి. అక్కడ భారత ఆర్మీ ఏర్పాటుచేసిన ఎయిర్‌స్ట్రిప్‌పై తొలిసారిగా రాత్రి టైంలో ‘సీ-130జే’ సైనిక విమానం ల్యాండ్ అయింది. ఈ విమానానికి నాలుగు టర్బోప్రాప్ ఇంజిన్లు ఉంటాయి. గరుడ్ కమాండోల శిక్షణలో భాగంగా ఈ విమానాన్ని.. హిమాలయాల్లో 8800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండ్ చేశారు. టెర్రైన్ మాస్కింగ్‌ను కూడా ఈసందర్భంగా ఉపయోగించారు. వాయుసేనకు సీ-130జే అత్యంత నమ్మకమైన విమానం. ఈవివరాలను భారత వాయుసేన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించింది. ఈ అసాధారణమైన విజయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంసిద్ధతను, నైపుణ్యాన్ని అద్దంపడుతోంది. విభిన్న వాతావరణాలలో దేశం యొక్క భద్రతకు భరోసానిస్తూ, వాయుసేన చేస్తున్న కార్యాచరణకు ఈ అభ్యాసం నిదర్శనంగా నిలుస్తోంది. భారత వాయుసేన ప్రస్తుతం పన్నెండు సీ-130జే విమానాలను వాడుతోంది. ప్రస్తుతం ఇవి హిండన్‌లోని 77 స్క్వాడ్రన్, 87 స్క్వాడ్రన్‌లో విధులు నిర్వహిస్తున్నాయి. ఈ విమానాల ద్వారా సైనిక బలగాలు, సైనిక సామగ్రిని తరలిస్తుంటారు. చైనా బార్డర్‌లో ఆర్మీని మోహరించడంలో ఇవి కీలకమైన సేవలను(Kargil Historic) అందిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
గతేడాది నవంబరులో ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే రెస్క్యూ వర్క్‌లో లాక్‌హిడ్ మార్టిన్‌కు చెందిన సూపర్ హెర్క్యులస్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానం కీలక పాత్ర పోషించింది. ఆ టైంలో రెండు సూపర్ హెర్క్యులస్ విమానాలను భారత వాయుసేన విజయవంతంగా ఉత్తరాఖండ్ ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండ్ చేసింది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా.. ఆ విమానాలు భారీ ఇంజనీరింగ్ పరికరాలను అక్కడికి తరలించగలిగాయి.
Also Read: Equal Share To Daughters : చనిపోయిన కుమార్తెలకూ ఆస్తిలో సమాన హక్కు.. సంచలన తీర్పు
1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఉత్తర కశ్మీర్‌లో ఉన్న గలి–ముష్కో లోయ అంతా ఆర్మీ కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. అక్కడికి ఎవరినీ అనుమతించేవాళ్లు కాదు. ఇన్నేళ్ల తర్వాత అక్కడికి టూరిస్టులను అనుమతిస్తున్నారు. లఢఖ్‌కు దగ్గర్లో ఉన్న ముష్కో లోయను గురెజ్ వ్యాలీతో కలిపే 130 కిలోమీటర్ల రోడ్డు ఇప్పుడు పర్యాటకుల కోసం తెరచుకుంది. కశ్మీర్‌లోని గురెజ్ లోయను 2023 సంవత్సరంలో 5000 మంది టూరిస్టులు సందర్శించారు. ఈ లోయ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)కు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఉండే కిషన్‌గంగా నది సరిహద్దు రేఖగా పనిచేస్తుంది. ఈ రెండు లోయలను కలిపే రహదారిని ప్రస్తుతం ‘బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్’ నిర్వహిస్తోంది. అయితే ఈ రోడ్డులో కేవలం జీప్ వంటి ఆఫ్ రోడ్ వెహికల్స్ మాత్రమే వెళ్లగలవు.