Indian Air Force Jaguar fighter : గుజరాత్‌లో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం
Indian Air Force Jaguar fighter : ఈ ప్రమాదంలో తమ పైలట్‌ను కోల్పోవడం చాలా బాధాకరమని భారత వాయుసేన పేర్కొంది. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది
- By Sudheer Published Date - 09:04 AM, Thu - 3 April 25

గుజరాత్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం (Indian Air Force Jaguar fighter) ప్రమాదవశాత్తూ (Crashes) కూలిపోయింది. జామ్‌నగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఒక పైలట్ మృతి (One Pilot was Killed ) చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నైట్ మిషన్‌లో భాగంగా శిక్షణ విమానాన్ని నడిపేందుకు బయల్దేరిన సమయంలో సాంకేతిక లోపం ఏర్పడి, ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు, వైమానిక స్థావరం మరియు జనావాస ప్రాంతాలకు హాని జరగకుండా విమానాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే చివరకు విమానం కూలిపోయింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు భారత వైమానిక దళం (IAF) అధికారిక ప్రకటనలో తెలిపింది.
Theft : ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం
ఈ ప్రమాదంలో తమ పైలట్‌ను కోల్పోవడం చాలా బాధాకరమని భారత వాయుసేన పేర్కొంది. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. జామ్‌నగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని సువర్ద గ్రామంలో ఈ ప్రమాదం సంభవించగా, సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన వెంటనే కాక్‌పిట్ మరియు వెనుక భాగం వేర్వేరుగా పడిపోవడం, అనంతరం మంటలు చెలరేగి కాక్‌పిట్ పూర్తిగా దగ్దమవడం వీడియోల్లో కనిపిస్తోంది. ఈ యుద్ధ విమానం రోజువారీ శిక్షణలో భాగంగా రెండు సీట్ల మోడల్‌గా పైలట్లు నడిపినట్లు అధికారులు తెలిపారు.
BCCI : ఉప్పల్ స్టేడియంపై బీసీసీఐ చిన్న చూపు
జాగ్వార్ యుద్ధ విమానం భారత వైమానిక దళంలో కీలకమైన స్థానాన్ని కలిగి ఉంది. 1970లలో ఐఏఎఫ్‌లో చేర్చిన ఈ యుద్ధ విమానాన్ని అనేక మార్లు అప్‌గ్రేడ్ చేశారు. ఇది లేజర్ గైడెడ్ బాంబులు, నైట్ విజన్ సామర్థ్యాలను కలిగి ఉండటంతో పాటు అణు బాంబులు మోసుకెళ్లగలిగే ఐఏఎఫ్‌లోని కొద్ది విమానాల్లో ఒకటి. అయితే గతంలోనూ జాగ్వార్ విమానాలు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాయి. 2021లో గోరఖ్‌పూర్ వద్ద, 2017, 2018, 2019లో ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాలు ఇంతవరకు కారణాలు తెలియకపోయినా, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. తాజా ఘటన అనంతరం భారత వాయుసేన మరింత మెరుగైన భద్రతా చర్యలు చేపట్టే అవకాశముంది.